Eesha Rebba Saree Pics: బ్లాక్ సారీలో ఈషా రెబ్బా.. తెలుగు అందం అందాలు అదరహో!
మొన్నటి వరకు చిట్టి పొట్టి డ్రసుల్లో దర్శనమిచ్చి గ్లామర్ ట్రీట్ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పు బ్లాక్ సారీలో కూడా అందాలను ప్రదర్శిస్తూ హాట్ టాపిక్‌గా మారారు. తాజా ఫోటోలలో ఆమె తెలుగుతనం ఉట్టిపడేలా ఉన్నారు.
ఈ మధ్య కాలంలో ఈషా రెబ్బా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. తన లేటెస్ట్ హాట్ ఫొటోస్‌తో కుర్రకారుకు ఊపిరాడనీయకుండా చేస్తున్నారు.
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలో ఈషా రెబ్బా ఓ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా తర్వాత మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. అయితే అవన్నీ సైడ్ క్యారెక్టర్లు. హీరోయిన్‌గా ఓ మంచి సినిమా కోసం తెలుగు అందం ఎదురు చూస్తున్నారు.
అందంతో పాటు అభినయం ఉన్న ఈషా రెబ్బాకు సరైన సినిమా అవకాశాలు రాలేదనే చెప్పాలి. దాంతో సినిమాల కంటే కూడా వెబ్ సిరీస్ మీద ఫోకస్ పెట్టారు. తెలుగు ఓటీటీలో ఆమధ్య వచ్చిన 'పిట్ట కథలు'తో బాగానే ఆకట్టుకున్నారు.
ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన 'అ' మూవీలో ఈషా నటనకు మంచి మార్కులే పడ్డాయి. 'అరవింద సమేత వీరరాఘవ'లో హీరోయిన్ చెల్లి పాత్ర చేసి మెప్పించారు. బ్రాండ్ బాబులో హీరోయిన్‌గా ఆకట్టుకున్నారు.
తెలుగు భామ ఈషా రెబ్బా 'అంతకుముందు ఆ తర్వాత' చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. బందిపోటు, అమీతుమీ లాంటి సినిమాల్లో తెలంగాణ యాసలో అదరగొట్టారు.