Eesha Rebba Pics: బ్లాక్ డ్రెస్‌లో ఈషా రెబ్బా.. మెరిసిపోతున్న అచ్చ తెలుగు అందం!
ఈషా రెబ్బా ఇటీవలి కాలమో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. తన హాట్ ఫొటోస్‌తో కుర్రకారుకు ఊపిరాడనీయకుండా చేస్తున్నారు. ఆమె పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల వర్షం కురుస్తుంటుంది.
అందంతో పాటు అభినయం ఉన్న ఈషా రెబ్బాకు సరైన సినిమా అవకాశాలు రాలేదు. దాంతో సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లపై కూడా ఫోకస్ పెట్టారు. హీరోయిన్‌గా ఓ మంచి సినిమా కోసం ఈషా ఎదురు చూస్తున్నారు.
ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన 'అ' మూవీలో ఈషా నటనకు మంచి మార్కులు పడ్డాయి. 'అరవింద సమేత వీరరాఘవ'లో హీరోయిన్ చెల్లి పాత్ర చేసి మెప్పించారు. బ్రాండ్ బాబులో హీరోయిన్‌గా ఆకట్టుకున్నారు.
'అంతకుముందు ఆ తర్వాత' చిత్రంతో తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. బందిపోటు, అమీతుమీ సినిమాల్లో అదరగొట్టారు.
ఈషా రెబ్బా కాలేజీ సమయంలో మోడల్‌గా పని చేశారు. దాంతో దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి నుంచి ఆమెకు ఆడిషన్ కాల్ వచ్చింది. 2012లో 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాతో తెరంగేట్రం చేశారు.
1990 ఏప్రిల్ 19న ఈషా రెబ్బా తెలంగాణలోని వరంగల్‌లో జన్మించారు. హైదరాబాద్‌లో పెరిగిన ఈషా ఎంబీఏ పూర్తి చేశారు.