Tollywood News: అప్పట్లో దర్శన్ ని ప్రేమించిన తెలుగు స్టార్ హీరోయిన్.. అందువల్లే కెరీర్ కి ఎండ్ కార్డ్..!
హాయ్ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ నిఖితా. మొదటి సినిమా పరవాలేదు అనిపించుకున్న.. ఈ హీరోయిన్ కి అప్పట్లో వరసగా అవకాశాలు వచ్చాయి. ఆ తరువాత వెంటనే.. నితిన్ సంబరం సినిమాలో కనిపించింది.
అయితే సంబరం సినిమా కూడా పెద్దగా విజయం.. సాధించలేదు. అయినా ఆ తరువాత కల్యాణ రాముడు, డాన్ లాంటి చిత్రాలలో కనిపించింది. ఇక నాగార్జున హీరోగా వచ్చిన డాన్ చిత్రంలో అయితే ఏకంగా నెగటివ్ పాత్రలో కనిపించింది నిఖితా.
తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ భాషలలో కూడా ఈ హీరోయిన్ ఎన్నో సినిమాలలో నటించింది. ఫ్లాపులు ఎదుర్కొన్న ఈ హీరోయిన్ కి సినిమా అవకాశాలు మాత్రం వచ్చాయి. అయితే ఈ హీరోయిన్ చేసిన చిన్న తప్పు వల్ల అవకాశాలు కాస్తా పోయాయి.
కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడు ఈ హీరోయిన్.. ఆల్రెడీ పెళ్లైన స్టార్ దర్శన్ తో ప్రేమాయణం నడిపింది. ఇంకా ఈ విషయం కాస్త బయటకు రావడంతో ఆమె ఫ్యాన్స్ కూడా నిఖితా తీరుపై మండిపడ్డారు. ముఖ్యంగా అప్పట్లో దర్శన్ భార్య నిఖితాకి వార్నింగ్ ఇచ్చినట్టు కూడా వార్తలు వచ్చాయి..
తన భర్తకు దూరంగా ఉండాలని అతని భార్య అప్పట్లో సీరియస్ అయ్యింది. దీంతో నిఖితా తన ప్రేమను వదిలేసింది. కానీ అదే సమయంలో ఈ హీరోయిన్ వరుస వివాదాలు చుట్టుముట్టాయి. అప్పట్లో దర్శన్ భార్య.. అతడి పై గృహహింస కేసు కూడా పెట్టడం గమనర్హం. ఈ కేసులో దర్శన్ అరెస్ట్ అయ్యారు. ఇక ఆ విషయం జరిగాక.. కన్నడ సినీ పరిశ్రమలో నిఖిత, దర్శన్ వ్యవహరం పెద్ద దుమారం రేపటమే కాకుండా.. నిఖితపై కన్నడ సినీ నిర్మాతల సంఘం మూడు సంవత్సరాల పాటు నిషేదం విధించింది. దీంతో ఇతర భాషల్లో కూడా ఈ హీరోయిన్ కి అవకాశాలు రాక ఆమె కెరియర్ కి ఎండ్ కార్డ్.. పడింది.