Tollywood heroes Remunaration: తెలుగులో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలు వీళ్లే.. టాప్ ప్లేస్ ఎవరిదంటే..
విజయ్ దేవరకొండ..
విజయ్ దేవరకొండ వరుస ఫ్లాపులున్న ఒక్కో చిత్రం కోసం రూ. 15 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు సమాచారం.
నాని..
నాచురల్ స్టార్ నాని ఒక్కో సినిమా కోసం దాదాపు రూ. 8 కోట్ల నుంచి రూ. 15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.
అల్లు అర్జున్..
అల్లు అర్జున్.. ప్రస్తుతం ఒక్కో చిత్రం కోసం రూ. 50 కోట్ల నుంచి రూ. 60 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇపుడు పుష్ప 2 తర్వాత తన పారితోషకం పెంచే అవకాశాలున్నాయి.
రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా సత్తా చూపెట్టాడు. ఇక శంకర్ దర్శకత్వంలో చేస్తోన్న 'గేమ్ ఛేంజర్' మూవీ కోసం రూ. 60 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నట్టు సమాచారం.
ఎన్టీఆర్..
ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ రేంజ్ ప్యాన్ భారత్ లెవల్‌కి పెరిగింది. ఆర్ఆర్ఆర్ మూవీకి రూ. 40 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు ఎన్టీఆర్. తాజాగా దేవరతో పాటు త్వరలో హిందీలో చేస్తోన్న వార్ 2 కోసం ఏకంగా రూ. 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.
మహేష్ బాబు.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కో చిత్రం కోసం దాదాపు రూ. 80 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. రాజమౌళి సినిమా కోసం ఏకంగా రూ. 140 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ప్రభాస్.. బాహుబలి సినిమాతో ప్రభాస్ ప్యాన్ భారత్ స్టార్ అయ్యాడు. ప్రస్తుతం ఒక్కో మూవీకి రూ. 120 కోట్ల నుంచి రూ. 150 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటూ మన తెలుగులో కాదు.. మన దేశంలోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా రికార్డులకు ఎక్కారు.
పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈయన ఒక్కో చిత్రానికి దాదాపు రూ. 50 కోట్ల నుంచి రూ. 60 కోట్ల రేంజ్‌లో పారితోషకం తీసుకుంటున్నట్టు స్వయంగా వెల్లడించారు.