Tollywood Senior Heroins Remunartions: అనుష్క, నయనతార, సమంత సహా సీనియర్ హీరోయిన్స్‌లలో ఎవరి పారితోషకం ఎంతంటే..

Thu, 18 Apr 2024-8:55 am,

తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్స్‌తో పాటు సీనియర్ భామలకు ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంది. ఇందులో నయనతార, అనుష్క శెట్టి, సమంత కూడా ఓ రేంజ్‌లో పారితోషకాలు అందుకుంటున్నారు. ఇందులో ఎవరి రెమ్యునరేషన్ ఎంతంటే..

అనుష్క శెట్టి..

అనుష్క శెట్టి .. టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్ హీరోలకు పర్ఫెక్ట్ ఛాయిస్. ఈమె ఒక్కో సినిమాకు రూ. 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోంది.

 

నయనతార.. నయనతార.. ఇండస్ట్రీకి వచ్చిన 2 దశాబ్దాలుగా లేడీ సూపర్ స్టార్‌గా అలరిస్తోంది. ఈమె ఒక్కో సినిమాకు దాదాపు రూ. 5 కోట్ల వరకు పారితోషకం అందుకుంటోంది.

 

సమంత..

సమంత టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా అలరిస్తోంది. ఈమె ఒక్కో చిత్రానికి దాదాపు రూ. 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. తాజాగా 'సిటాడెల్' వెబ్ సిరీస్‌ కోసం రూ. 3.5 కోట్ల వరకు ఛార్జ్ చేసినట్టు సమాచారం.

త్రిష.. త్రిష కథానాయిగా రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. ఈమె ఒక్కో సినిమాకు రూ. 2 కోట్ల నుంచి 2.5 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు సమాచారం. 'విశ్వంభర' కోసం దాదాపు రూ. 2.5 కోట్ల పారితోషకం తీసుకున్నట్టు సమాచారం.

కాజల్ అగర్వాల్. . పెళ్లై ఓ పిల్లాడు పుట్టిన తర్వాత కూడా కథానాయికగా అదే దూకుడు చూపిస్తోంది. భగవంత్ కేసరి సినిమా కోసం దాదాపు రూ. 2 కోట్ల వరకు పారితోషకం తీసుకున్నట్టు సమాచారం.

తమన్నా.. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్‌లలో తమన్నా ఒకరు. ఈమె ఒక్కో సినిమాకు రూ. కోటి వరకు పారితోషకం తీసుకుంటున్నట్టు సమాచారం.

రకుల్ ప్రీత్ సింగ్.. రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం ఈ భామకు డిమాండ్ తగ్గింది. అందుకే ఒక్కో సినిమాకు దాదాపు రూ. 70 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link