Pushpa 3: పుష్ప 3 ర్యాంపేజ్.. విలన్ గా తెలుగు స్టార్ హీరో..!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక నటించిన చిత్రం పుష్ప-2.. ఈ సినిమా ఈనెల 5వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో రావడానికి సిద్ధంగా ఉన్నది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని పుష్ప-2 సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి.
అయితే ఇటీవల కూడా అధికారికంగా ధ్రువీకరించినట్లుగా వార్తలు వినిపించాయి. ఈ సినిమా టైటిల్ కూడా పుష్ప-3 రాంపేజ్ అని కూడా పెట్టినట్లు సమాచారం.
ఈ చిత్రానికి సౌండ్ డిజైనర్ గా పని చేసిన రసూల్ పోగొట్టి తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ షేర్ చేయడం జరిగింది.. పుష్ప -3 విషయాన్ని ధృవీకరించి, మూడో భాగంతో పుష్ప సినిమా ఎండ్ కార్డు పడుతుందనే విధంగా తెలియజేసినట్లు సమాచారం. అయితే సుకుమార్ మాత్రం మీ హీరో మరొక మూడేళ్లు ఇస్తే ఖచ్చితంగా పార్ట్-3 తీస్తానని చెప్పారు.
ఇలాంటి సమయంలోనే పుష్ప-3 చిత్రంలో విజయ్ దేవరకొండ విలన్ గా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకు ముఖ్య కారణం గత కొద్ది సంవత్సరాల క్రితమే సుకుమారికి బర్తడే విషెస్ చెబుతూ.. విజయ్ దేవరకొండ ఒక ఫోటో షేర్ చేశారు. అందులో త్వరలో రాంపేజ్ ఉంటుందని.. తన సుకుమార్ తో చేయాలని ఆసక్తిగా ఉందని దేవరకొండ పేర్కొన్నది గవర్నర్హం. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ఎవరు ధ్రువీకరించలేదు.. ఒకవేళ ఇందులో విలన్ గా నటిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాకి భారీ హైప్ ఉంటుంది..
రష్మిక కూడా ఇందులో హీరోయిన్ గా నటించబోతుందని అందుకే విజయ్ దేవరకొండ విలన్ పాత్రలో నటిస్తున్నారని అభిమానులైతే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉన్నది. పుష్ప-2 పాటలో కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మరి రాబోయే రోజుల్లో పుష్ప-3 పై డైరెక్టర్ సుకుమార్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి..