Bank Holiday: రేపు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవు.. హైదరాబాద్‌లో ఉన్న బ్యాంకులు పనిచేస్తాయా?

Tue, 01 Oct 2024-8:23 am,

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులు ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌ ప్రకారం సెలవులు ప్రతి ఏడాది విడుదల చేసే క్యాలండర్‌ ఆధారంగా ఉంటాయి. ఇందులో కొన్ని స్థానిక పండుగల ఆధారంగా కూడా జరుపుకొంటారు. అయితే ప్రతి ఏడాది మూడు పబ్లిక్‌ సెలవులు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు వర్తిస్తాయి. రిపబ్లిక డే జనవరి 26  ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం గాంధీ జయంతి అక్టోబర్‌ 2.  

గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు రేపు బుధవారం అక్టోబర్‌ 2న సెలవు. జాతిపిత జన్మదినం సందర్భంగా గాంధీని స్మరించుకుంటూ ఈరోజు మన దేశ వ్యాప్తంగా వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకొంటారు. యూఎన్‌ఐ ఈ రోజును అహింస దినంగా ప్రకటించింది కూడా  

అయితే, అక్టోబర్‌ నెలలో కేవలం 15 రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి. ఈ నెలలో దసరా నవ రాత్రులు, దీపావళి సందర్భంగా ఈ సెలవులు రానున్నాయి. అంతేకాదు రెండో నాలుగో శనివారంతోపాటు ప్రతి ఆదివారం కూడా దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు బంద్‌ ఉంటాయి  

ఈ నెలలో గాంధీ జయంతితో ప్రారంభం అవుతుంది బ్యాంకుల సెలవులు. ఈరోజు మహాలయ అమావాస్య కూడా రానుంది. ఇక ఆయుధపూజ, దుర్గాష్టమి, దసరా రోజుల్లో కూడా బ్యాంకులు సెలవు ఉన్నాయి. ఈ నెల అక్టోబర్‌ 31న దీపావళి పండుగ సందర్భంగా కూడా బ్యాంకులకు సెలవు. రేపు అక్టోబర్‌ ౩న నవరాత్రి స్థాపన సందర్భంగా రాజస్థాన్‌లో బ్యాంకులు బంద్‌ ఉంటాయి.   

అక్టోబర్‌ 10వ తేదీ దుర్గా పూజ మహా సప్తమి సందర్భంగా త్రిపురా,అసోం, నాగాలాండ్‌, బెంగాల్‌లో బ్యాంకులు బంద్‌ పాటించనున్నాయి. అయితే, అక్టోబర్‌ 12 వ తేదీ దసరా పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పబ్లిక్‌, ప్రైవేటు రంగ బ్యాంకులకు సెలవు దినంగా ప్రకటించారు. అంతేకాదు ఈరోజు రెండో శనివారం కూడా.   

ఇదిలా ఉండగా లక్ష్మిపూజ సిక్కింలో అక్టోబర్‌ 16న నిర్వహించనున్నారు. అక్టోబర్‌ 17న కర్నాటక, అసోం, హిమాచల్‌ ప్రదేశ్‌లో వాల్మికి జయంతి సందర్భంగా బ్యాంకులు బంద్‌ ఉంటాయి. అయితే అక్టోబర్‌ 26న ప్రవేశ దినం సందర్భంగా జమ్మూ కశ్మిర్‌లో ఉన్న అన్ని బ్యాంకులకు సెలవు.  

దిపావళి ఇది అక్టోబర్‌ చివరి రోజు అయిన 31వ తేదీనా రానుంది. ఈోజు కాళీ పూ, సర్ధార్‌ వల్లభాయి పటేట్‌ పుట్టిన రోజు, నరక చతుర్ధశి కూడా జరుపుకొనున్నారు. ఈ సందర్భంగా కూడా త్రిపురా, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌ సిక్కిం, మణిపూర్‌, మేఘాలయా వంటి రాష్ట్రాల్లో అన్ని బ్యాంకులకు సెలవు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link