Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ టాప్ 10 రహాస్యాలు ఇవే!
దేశంలో ఎవరికీ సాధ్యం కాని ఘనత.. రికార్డులు ఆయన పొందారు. ఆ టాప్ 10 రహాస్యాలు తెలుసుకుందాం.
ఆజాత శత్రువు.. మితభాషి.. ఆర్థిక సంస్కరణల పితామహుడు.. మేధావి.. భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటిన మహానీయుడు ఇలా మన్మోహన్ సింగ్‌కు ఎన్నో బిరుదులు కలిగి ఉన్నాయి.
అధ్యాపకుడిగా.. ఆర్బీఐ గవర్నర్‌గా.. ఆర్థిక సలహాదారుగా.. రాజ్యసభ సభ్యుడిగా.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా.. భారతదేశ ప్రధానమంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ పనిచేశారు.
జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన వృద్ధ నాయకుడు మన్మోహన్ సింగ్. కాకపోతే అతడి రాజకీయ వారసత్వం ఎవరూ కొనసాగించలేకపోయారు.
నేడు పాకిస్థాన్‌లోకి వెళ్లిన భూభాగంలో పుట్టి భారతదేశానికి మన్మోహన్ కుటుంబం వలస వచ్చింది. పాకిస్థాన్ విభజనతో ఢిల్లీకి వలస వచ్చి స్థిరపడింది.
లోక్‌సభ ఎన్నికల్లో విజయంతో 2004లో సోనియా గాంధీ ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. అనుకోని పరిస్థితుల్లో ఆమె ప్రధాని పదవిని వైదొలగడంతో అనూహ్యంగా మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి పదవిని అధిష్టించారు.
పదేళ్ల పాటు గాంధీ కుటుంబం కాని వ్యక్తి ప్రధానమంత్రి పదవిలో కొనసాగిన నాయకుడిగా మన్మోహన్ సింగ్ అరుదైన ఘనత సాధించాడు.
రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు కొనసాగిన మన్మోహన్ సింగ్ ఏనాడూ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదు. లోక్‌సభ సభ్యుడిగా.. ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీగా ఎన్నిక కాకపోవడం విశేషం. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఆరు పర్యాయాలు పని చేశారు. ఢిల్లీలోని లోక్‌సభ స్థానానికి పోటీచేసినా ఆయన గెలవలేదు.
అరవై ఏండ్ల కల అయిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మన్మోహన్ సింగ్ హయాంలోనే కావడం విశేషం. అతడి హయాంలోనే తెలంగాణ ఏర్పాటవడంతో మన్మోహన్‌కు తెలంగాణతో అవినాభావ సంబంధం ఉంది.
మన్మోహన్ సింగ్‌తో బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి అనుబంధం ఉంది. మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేసీఆర్ కేంద్ర మంత్రిగా పని చేశారు.
తెలుగు రాష్ట్రాలతో మన్మోహన్ సింగ్‌కు మంచి అనుబంధం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానమంత్రిగా పలుమార్లు పర్యటించారు. ముఖ్యంగా వెనుకబడిన మహబూబ్‌నగర్, అనంతపురం జిల్లాలకు అత్యధిక నిధులు ఇచ్చారు.
మన్మోహన్ ప్రభావంతమైన వ్యక్తి. ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదివారు. ప్రధానిగా విదేశాల్లో భారతదేశ కీర్తిప్రతిష్టలను పెంచారు. దేశ, విదేశాల నాయకులతో సత్సంబంధాలు కొనసాగించారు.