Best Breakfasts: స్కూల్ పిల్లలకు తప్పక తీసుకోవల్సిన 5 బ్రేక్‌ఫాస్ట్‌లు ఇవే
అవకాడో
అవకాడో చాలా చాలా హెల్తీ ఫుడ్. ఇందులో గుడ్ ఫ్యాట్, న్యుట్రియంట్స్ పెద్దఎత్తున ఉంటాయి. అవకాడో తినడం వల్ల కడుపు ఎక్కువసేపు నిండుగా ఉన్నట్టుంటుంది. ఫలితంగా బరువు నియంత్రణలో దోహదం చేస్తుంది.
నట్స్
నట్స్‌లో గుడ్ ఫ్యాట్, విటమిన్లు, మినరల్స్ చాలా ఉంటాయి. అందుకే బ్రేక్‌ఫాస్ట్‌లో పిల్లలకు ఇవి ఇవ్వడం వల్ల రోజంతా పిల్లలకు ఎనర్జీ లభిస్తుంది. వివిధ రకాల నట్స్ కలిపి తినవచ్చు.
యోగర్ట్ అండ్ బెర్రీస్
యోగర్ట్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో బెర్రీస్ కలుపుకుంటే అద్భుతమైన బ్రేక్‌ఫాస్ట్ అవుతుంది. పిల్లల దినచర్య అద్భుతంగా ఉంటుంది. రోజంతా ఎనర్జీతో ఉంటారు
గుడ్లు
గుడ్లలో ప్రోటీన్లు ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఉడకబెట్టిన గుడ్లు మంచి ఆప్షన్. పిల్లలు ఏది ఇష్టపడతారో ఆ రూపంలో ఇవ్వవచ్చు. స్కూల్ పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డు ఇస్తే చాలా మంచిది
ఓట్స్
హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఓట్స్. పిల్లలకు ఉదయం సమయంలో ఇది చాలా బెస్ట్ ఫుడ్. ఇందులో హెల్తీ ఫ్యాట్, హెల్తీ కేలరీలు, ప్రోటీన్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి రోజువారీ అవసరాల్ని తీరుస్తాయి.