Business Idea: నెలకు 4 లక్షలు పక్కా.. . దసరా, దీపావళి సీజన్‌లో ఈజీ బిజినెస్ ఐడియాలు మీ కోసం..
ప్రస్తుతం కాస్ట్ ఆఫ్ లివింగ్ భారీగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఒకవైపు ఉద్యోగం చేస్తునే మరోవైపు సైడ్ ఇన్ కమ్ కోసం నానా పాట్లు పడుతున్నారు. కొంత మంది బిజినెస్ లు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం దసరా, దీపావళి పండగ సీజన్ స్టార్ట్ అయ్యింది. ఈ కాలంలో ఈ కింది బిజినెస్ లు చేస్తే నెలకు 4 లకల వరకు ఆదాయం మీ సొంత మౌతుంది.
చాలా మంది ప్రతిపండగకు తమ ఇంట్లో దేవుడికి ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు. పూజలలో కొబ్బరి కాయల్ని తప్పకుండా కొడుతారు. అందు వల్ల కొబ్బరికాయ చాలా ప్రాఫిటబుల్ బిజినెస్ గా చెప్పవచ్చు. అంతేకాకుండా.. ఇవి తొందరగా పాడవ్వరు. నెలల తరబడి నిల్వఉంటాయి. మార్కెట్ లో ఒక కాయ ఏరియాను బట్టి ఒక్కొటి 50రూ . వరకు ఉంటుంది.
అదే విధంగా పూల బిజినెస్ కూడా ఎవర్ గ్రీన్ అని చెప్పుకొవచ్చు. గులాబీ పూలు, మల్లెపూలు, చామంతి పూలు మొదలైన వాటికి చాలా డిమాండ్ ఉంటుంది. దససా, దీపావళి వేళల్లో ప్రతి ఒక్కరు తమ ఇంటి నిండా పూలతో అలంకరణ చేస్తుంటారు. అందుకు పూల బిజినెస్ వల్ల చాలా ప్రాఫిట్ వస్తుందని చెప్పుకొవచ్చు. కొన్ని పూలు కేజీకి.. 300 నుంచి 500 రూపాల వరకు అమ్ముతుంటారు.
తమలపాకుల బిజినెస్ కూడా చాలా ప్రాఫిట్ ను తెచ్చిపెడుతుంది. దీన్ని ఇంట్లో కూడా పెంచుకొవచ్చు. పాన్ షాపులు వారు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. చాలా మందికి పాన్ లు తినే అలవాటు ఉంటుంది. పాన్ ను పండించే వారు.. పాన్ డబ్బాల వాళ్లతో కలిసి బిజినెస్ లు చేస్తుంటారు.
గుమ్మడి కాయ.. దసరాలో గుమ్మడి కాయల్ని చాలా మంది కొనుగోలు చేస్తారు.దసరారోజు తమ ఇంటికి గుమ్మడి కాయల్ని తీసేసి కొత్తి గుమ్మడి కాయల్ని కట్టుకుంటారు. ఇదిల అనాదీగా ఆచరిస్తు వస్తున్నారు. చాలా మంది తమ ఇంటిముందు, వాహానం ముందు గుమ్మడి కాయలతో దిష్టి తీసేస్తుంటారు.
అరటి ఆకులు, అరటి చెట్లు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా పండుగల వేళ.. అరటి చెట్లు, అరటి ఆకుల్ని గుమ్మం ముందు పెట్టుకుంటారు. అరటి ఆకులో పండుగ పూట తినేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. అందు వల్ల పండుగ వేళ అరటికి కూడా ఫుడ్ డిమాండ్ ఉంటుంది.
దసరా,దీపావళి పండుగ ఏదైన.. చాలా మంది టిఫిన్ లు స్నాక్స్ లు చేసుకుంటారు. కొంత మందికి ఇంట్లో స్నాక్ లు చేసుకునేసమయం ఉండదు.అందుకు చాలా మంది బైటషాపులలో కొంటారు.అందుకే మిక్సర్, స్వీట్లు, స్నాక్ లను చేసి అమ్మే బిజినెస్కు చాలా ఆదాయం వస్తుందని చెప్పుకొవచ్చు. ఈ స్నాక్స్ కేజీకి 200ల నుంచి 300 వరకు ఉంటుంది. (Disclimer: పైన పేర్కొన్న అంశాలను Zee Mediaధృవీకరించలేదు)