అలనాటి అందాల తారలు.. నాడు నేడు
1997లో తమిళ చిత్రం ఇరువర్ తో నటిగా తెరంగేట్రం చేసిన ఐశ్వర్య రాయ్ ( Aishwarya Rai ) కెరియర్ విజయవంతంగా సాగింది. 1994లో ప్రపంచ సుందరిగా కిరీటం గెలుచుకున్న ఐశ్వర్య రాయ్ నేటికీ అభిమానుల గుండెల్లో అందానికి పర్యాయపదంగా మిగిలిపోయింది.
తొంబైల నాటి అతిలోక సుందరి కాజోల్ (Kajol ) తన కెరియర్ లో బేగుది సినిమాతో 1992లో ప్రారంభించింది. మొదట్లో కాజోల్ లుక్ ను చాలా మంది విమర్శించేవాళ్లు. కానీ తరువాత తన అభినయంతో సమాధానం చెప్పింది కాజోల్.
బాలీవుడ్ లో విజయానికి మారుపేరుగా మిగిలిపోయింది మాధురీ దీక్షిత్ ( Madhuri Dixit ).53 సంవత్సరాల మాధురి దీక్షిత్ అబోధ్ చిత్రంతో తెరంగేట్రం చేసింది. 1998 లో వచ్చిన తేజాబ్ చిత్రంతో తన విజయ ప్రస్థానం మొదలుపెట్టింది.
90ల నాటి ఎవర్ గ్రీన్ హీరోయిన్ రవీనీ టాండన్ ( Raveena Tandon ) ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించింది. 1992లో సినీ కెరియర్ ప్రస్థానం ప్రారంభించిన రవీనా స్టార్ హీరోలందరితో కలిసి ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించింది.
హిందీ సినిమాలతో పాటు బెంగాలి, మలయాళి, పంజాబీ, కన్నడ, తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి మంచి ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది జూహీ చావ్లా ( Juhi Chawla ).