Wine Shop: కోట్లలో లాభం వచ్చే మద్యం బిజినెస్‌ ప్రారంభించడం ఇలా? వైన్‌ షాప్‌ తెరవడం ఇలా

Tue, 01 Oct 2024-3:55 pm,

అద్భుత అవకాశం: కొత్త వ్యాపారం కోసం ఆలోచిస్తున్న ఔత్సాహికులకు అద్భుత అవకాశం లభించింది.

లాభాలే లాభాలు: మద్యం వ్యాపారం అనేది ఒక్కసారి పెట్టుబడి పెడితే భారీగా లాభాలు కురిపించే వ్యాపారం.

పెట్టుబడికి రెట్టింపు: రూ.లక్షలు మనవి కాదనుకుంటే రూ.కోట్లు సంపాదించే అవకాశం లభిస్తుంది. ఒక్కసారి మీ అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటే ఏపీ మద్యం దుకాణాలతో ప్రయత్నం చేయండి.

కొత్త పాలసీ; ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

నోటిఫికేషన్ జారీ: రెండేళ్ల కాల పరిమితితో నూతన మద్యం పాలసీకి నోటిఫికేషన్ జారీ చేయడంతో కొత్త దుకాణాలు కేటాయిస్తారు.

పాత విధానం స్వస్తి: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలుచేసిన మద్యం దుకాణాల విధానానికి స్వస్తి కూటమి ప్రభుత్వం స్వస్తి పలికింది.

డిపాజిట్: మద్యం దుకాణం కోసం దరఖాస్తు రుసుము రూ.2 లక్షలు డిపాజిట్‌ చేయాల్సి ఉంది.

తేదీలు ఇవే: మద్యం దుకాణాలకు దరఖాస్తులు అక్టోబర్‌ 1వ తేదీన ప్రారంభమవగా.. 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి.

లాటరీ: ఈనెల 11వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు అధికారులు లాటరీ తీస్తారు.

ఫీజు ఇలా: జనాభా ప్రాతిపదికన రూ.50 లక్షల నుంచి రూ.85 లక్షల వరకు లైసెన్స్ ఫీజు ఉంటుంది.

 ఆ రోజు నుంచే: ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక ఈనెల 12వ తేదీ నుంచి ప్రైవేటు మద్యం దుకాణాలు ప్రారంభమవుతాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link