Toyota Camry Glorious Edition Price: రూ.23 లక్షలకే Toyota లగ్జరీ కార్.. ఫీచర్స్, ఫోటోస్ ఇవే!
ఈ కారు ఛార్జింగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను కలిగి ఉండబోతున్నట్లు టయోటా కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా దీని ధర రూ.23.73 లక్షలుగా కూడా ప్రకటించినట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు అధికారిక సమాచారం.
గ్లోరియస్ ఎడిషన్ మాట్ గ్రే బాడీ కలర్‌తో పాటు స్టైలిష్ లుక్‌లో కనిపించేందుకు స్మూత్ ఫినిషింగ్ టచ్ ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ కారు ఫ్రంట్, బ్యాక్ భాగాల్లో బూట్‌పై క్యామ్రీ బ్రాండింగ్ కూడా మీరు చూడవచ్చు. అంతేకాకుండా ఇది బ్లాక్ అవుట్ టయోటా చిహ్నంతో కనిపిస్తుంది.
టయోటా క్యామ్రీ గ్లోరియస్ ఎడిషన్ (Toyota Camry Glorious Edition) చూడడానికి అచ్చం స్పోర్ట్స్ కార్ లుక్ లో ఉంటుంది. ఇందులో నల్లని గ్రిల్, ఫ్రంట్ స్ప్లిటర్, రియర్ డిఫ్యూజర్స్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ కారు 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ ను కలిగి ఉండబోతున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా యాంబియంట్ లైటింగ్ సిస్టమ్ కోసం 64 రంగుల ప్యాలెట్ సిస్టం కూడా ఇందులో తీసుకువచ్చింది.
ఇక ఈ కారులో అన్నింటినీ ఆపరేటింగ్ చేసేందుకు 12.3-అంగుళాల డిస్‌ప్లే కూడా ఉంటుంది. దీని ద్వారా కారును మొత్తం ఆపరేటింగ్ చేయొచ్చు. అలాగే ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్ కూడా ఉంటుంది. దీంతోపాటు ఒకటి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఇందులో అనేక రకాల హై ఎండ్ ఫీచర్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ కారు నాలుగు పెట్రోల్ ఇంజన్ల ఎలక్ట్రిక్ మోటార్ తో నడుస్తున్నట్లు టయోటా కంపెనీ తెలిపింది. అలాగే దీని ఇంజన్ 197 PS, 188 Nm ఉత్పత్తి చేస్తుంది. అయితే దీనిని త్వరలోనే భారత మార్కెట్లో కూడా ప్రవేశపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను టయోటా కంపెనీ త్వరలోనే వెల్లడించే అవకాశాలు కూడా ఉన్నాయి.