Trisha: చీరలో త్రిష అందాలు..అల్లంత దూరాలా ఆ తారక..

Fri, 23 Feb 2024-7:07 pm,

తరుణ్ హీరోగా చేసిన నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తమిళ హీరోయిన్ త్రిష. తెలుగులో, తమిళంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ముఖ్యంగా ప్రభాస్ హీరోగా చేసిన వర్షం సినిమాతో సూపర్ సక్సెస్ అందుకొని తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. 

వర్షం చిత్రం తర్వాత వరుసగా అవకాశాలు అందుకొని తెలుగులో దాదాపు అందరూ స్టార్ హీరోలతో అలానే యువతరం హీరోలతో నటించి మెప్పించింది.

త్రిష హీరోయిన్ గా చేసిన అతడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే చిత్రాలు ఆమెకు నటిగా మంచి పేరు తెచ్చిపెట్టాయి.

సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 20 సంవత్సరాలు కావస్తున్న ఇంకా కూడా ఈ హీరోయిన్ కి అవకాశాలు తగ్గకుండా వస్తున్నాయి. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమాలో కూడా త్రిష హీరోయిన్ గా చేస్తోంది. 

ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ఎర్ర చీరలో ఫోటోలు షేర్ చేసి అభిమానులని ఫిదా చేసింది త్రిష. ఈ ఫోటోలు చూసి ఆమె అభిమానులు ‘అల్లంత దూరాల ఆ తారక కళ్ళు ఎదుట నిలిచిందా ఈ తీరగా’ అంటూ సాంగ్ పాడేస్తున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link