TTD Chairman: టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు మరో సంచలన అడుగు.. ఆయన చేసిన పనికి చేతులెత్తి మొక్కాల్సిందే..

Mon, 11 Nov 2024-12:28 pm,

TTD Chairman BR Naidu: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే బీఆర్ నాయుడు తనదైన శైలిలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేవస్థానం అందించే వసతి, వాహన సదుపాయాలను సున్నితంగా తిరస్కరించారు. అంతేకాదు ప్రమాణ స్వీకారం కోసం తిరుమల వచ్చిన ఆయన.. తిరుమలలో బస చేసినన్ని రోజులు ఓన్ వెహికల్స్ ఉపయోగిస్తున్నారు. అంతేకాదు ఆయన సహచరులు, బంధు మిత్రులు బస చేసిన గదుల అద్డెలతో పాటు, భోజనాల ఖర్చును ఆయనే భరించారు.

ఆంధ్ర ప్రదేశ్ కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత లడ్డూ వివాదం నేపథ్యంలో టీటీడీ కొత్త పాలక మండలి ఏర్పాటు కాస్త ఆలస్యమైంది. ఇక కొత్తగా ఏర్పడిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మొదటి సమావేశం ఈ నెల 18న జరగనుంది. టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు నేతృత్వంతో కొత్తగా ఎంపికైన బోర్డు సభ్యులు అన్నమయ్య భవనంలో సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు. అంతేకాదు  సమావేశాల్లో తిరుమల ప్రక్షాళనకు సంబంధించి కీలన నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు సమాచారం.

ఈ మేరకు ఎజెండా సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. తొలిసారి జరగనున్న నూతన  బోర్డు సమావేశంలో ప్రధానంగా తిరుమల శ్రీవారికి వస్తు సంబరాల కొనుగోళ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించి తీర్మానాలను ప్రకటించనున్నారు. తిరుమల, తిరుపతిలో భక్తుల సౌకర్యార్థం తీసుకోవాల్సిన చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంపై దృష్టి సారించనున్నట్టు తెలుస్తోంది. గత పాలక మండలి తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలను చర్చించే అవకాశం ఉందట.

ప్రపంచ వ్యాప్తంగా హిందూ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుమల పవిత్రతను కాపాడుకోవడమే ప్రస్తుత టీటీడీ ధర్మకర్తల మండలి మొదటి ప్రాధాన్యతగా చెప్పుకొచ్చారు బీఆర్ నాయుడు. ప్రమాణస్వీకారం తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి భక్తులకు సేవ చేసుకునే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.  తాను చిన్నప్పటి నుండే ప్రతి యేటా శ్రీవేంకటేశ్వర స్వామిని కాలినడకన వచ్చి దర్శించుకునేవాడినన్నారు.

ప్రస్తుతం తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు సేవ చేసుకునే అరుదైన అవకాశాన్ని  తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి  ప్రసాదించడం పూర్వజన్మ సుకృతమన్నారు. భక్తులకు సేవ చేసేందుకు మీడియాతో సహా ప్రతి ఒక్కరూ తోడ్పాటునందించాలని కోరారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గత నెలలో బ్రహ్మోత్సవాలను ఎలాంటి అవాంతరాలు లేకుండా విజయవంతంగా నిర్వహించిన అధికారులకు అభినందనలు తెలిపారు. తిరుమల శ్రీవారి పవిత్రతను కాపాడేందుకు, భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు అధికారులు సమిష్టి కృషిని కొనసాగించాలన్నారు.

 

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల  28 నుంచి డిసెంబరు 6వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో చివ‌రిరోజున భ‌క్తులు ఎక్కువ సంఖ్యలో హాజరయ్య అవకాశాలున్నాయి. ఈ సందర్బంగా  విచ్చేసే పంచ‌మి తీర్థానికి తిరుమ‌ల నుండి వ‌చ్చే శ్రీ‌వారి సారె ఊరేగింపు ట్ర‌య‌ల్ ర‌న్ ఆదివారం నిర్వ‌హించారు. తిరుప‌తిలోని చెన్నారెడ్డి కాల‌నీలో గ‌ల శ్రీ వినాయ‌క స్వామివారి ఆల‌యం నుండి శ్రీ‌వారి సారె ఊరేగింపు ట్ర‌య‌ల్ ర‌న్ విజయవంతంగా నిర్వహించారు.  అక్క‌డి నుండి ఏనుగుపై సారెను ఊరేగింపుగా తీసుకొచ్చారు.

ముందుగా శ్రీ కోదండ‌రామాల‌యం, చిన్న‌బ‌జారు వీధి, పాత హుజుర్ ఆఫీస్‌, శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆలయం, శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం, బండ్ల వీధి, ఆర్‌టిసి బ‌స్టాండు, ప‌ద్మావ‌తి పురం, మార్కెట్ యార్డు, శిల్పారామం మీదుగా తిరుచానూరులోని ప‌సుపు మండ‌పం వ‌ద్ద‌కు ట్రయల్ రన్ విజయవంతం అయింది.  అక్క‌డినుండి శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యం వ‌ద్దకు చేరుకుని మాడ వీధుల గుండా పుష్క‌రిణి వ‌ద్ద‌గ‌ల మండ‌పానికి సారెను వేంచేపు చేశారు.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link