Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త.. గంటలోపే దర్శనం..

Wed, 18 Dec 2024-2:08 pm,

Tirumala Darshan News: తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం  శుభవార్త చెప్పింది. డి.జి.యాత్ర తరహాలో టీటీడీ బోర్టు  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  సాయాన్ని తీసుకోబోతుంది. శ్రీవారి దర్శనం కోసం నేటి నుండి వారం రోజుల పాటు ఏఐ పనితీరుపై స్క్రీన్ పై ప్రొజెక్టర్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. గంట దర్శనం టీటీడీ చైర్మన్ ఆధ్వర్యంలో  టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది.

ఎన్నో ఏళ్లుగా  తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు రోజుల తరబడి వేచి ఉండే పరిస్థితికి త్వరలో ఎండ్ కార్డ్ పడనుంది. చలిగాలుల్లో పిల్లా పాపలతో కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్ లలో పడరాని కష్టాలు పడుతున్న సామాన్య భక్తులకు ఈ పరిస్థితి నుంచి విముక్తి లభించనుంది.

దేవ దేవుడి దర్శనం కోసం తిరుమలకు వచ్చిన భక్తులకు కేవలం గంట లోపుగానే స్వామివారి దర్శనాన్ని కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం  పాలకమండలి కీలక తీర్మానం చేసింది. అంతేకాదు దీనిపై కసరత్తు కూడా మొదలు పెట్టింది. టిటిడి చైర్మన్ బి ఆర్ నాయుడు భక్తులకు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు చర్యలకు ఉపక్రమించారు. 

వెంకన్న స్వామి దర్శనం కోసం తిరుమల కొండకు చేరుకున్న భక్తులకు ముందుగా వారి ఆధార్ కార్డు నంబర్, ఫేస్ రికగ్నిషన్ తో  కూడిన రసీదును అందించేందుకు అందులో వారికి శ్రీవారి దర్శనానికి అయ్యే టైమ్ స్లాట్ సూచిస్తూ డిజి లాకర్ తరహాలో ఒక టోకెన్ ను ముందుగా అందిస్తారు.

ఈ టోకెన్ తీసుకున్న భక్తులు వారు కేటాయించిన టైమ్ కు  నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు చేరుకోగానే అక్కడ ఏర్పాటు చేసిన ఫేస్ రికగ్నిషన్ ఎంట్రన్స్ ద్వారా నేరుగా భక్తులు క్షణాల్లో స్కానింగ్ పూర్తి చేసుకుని నేరుగా క్యూ లైన్ కి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు.

అంతే కాకుండా కేవలం గంట  లోపుగానే స్వామివారి దర్శనం పూర్తి చేసుకుని కోవెవల వెలుపలకు వచ్చేసే అవకాశం ఉంటుంది. ఈ టోకెన్లు పొందేందుకు భక్తులకు సరిపడా దాదాపు 30 కౌంటర్లను ఏర్పాటు చేయాలని టీటీడీ భావిస్తోంది. ఈ 30 కౌంటర్ లతోపాటు ఫేస్ రికగ్నేషన్ చేసేందుకు కూడా ఇదే తరహాలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద మరో 30 స్కానింగ్ పేస్ రికగ్నేషన్ ఎంట్రన్స్ లను కూడా ఏర్పాటు చేస్తారట.

ఎక్కడా సిబ్బందితో పని లేకుండా ఆటోమేటిక్ గా విమానాశ్రయాలలో ఏ విధంగా అయితే డిజి లాకర్ పద్ధతి అమలు చేస్తున్నారో.. అదే తరహాలో తిరుమల కొండపై కూడా భక్తులు గంటలు తరబడి వేచి ఉండే అవసరం లేకుండా లేటెస్ట్ టెక్నాలజీని  వినియోగించుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో కేవలం గంట సమయంలోపుగా శ్రీవారి దర్శనాన్ని భక్తులకు కల్పించేందుకు  తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమైంది.

  ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ విధానం అమలు కోసం కావలసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్ వేర్ ను అందించేందుకు నాలుగు విదేశీ సంస్థలు కూడా ముందుకు వచ్చాయట. ఇప్పటికే టీటీడీలో అమలు చేస్తున్న విధానం..భక్తులను దర్శనానికి అనుమతిస్తున్న విధానం ఆధారంగా ఈ పద్దతిని ప్రవేశపెట్టబోతున్నారు. 

రోజు రోజుకు తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య, వారి నుంచి సేకరిస్తున్న సమాచారం తదితర పూర్తి వివరాలన్నింటినీ సాఫ్ట్వేర్ సంస్థలకు టీటీడీ అందించడం జరిగింది. ఈ మేరకు త్వరలో టీటీడీలో అమలు చేయనున్న ఏఐ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రొజెక్టర్ ప్రజెంటేషన్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ నిపుణులు టిటిడి ఉన్నతాధికారులకు నేటి నుండి వారం రోజుల పాటు ప్రయోగాత్మకంగా ప్రదర్శించనున్నారు.

టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు, ఈ అంశంపై టిటిడి ఈవో శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ముఖ్య భద్రతాధికారి శ్రీధర్ తదితరులతో ఇప్పటికే ఈ విషయమై సమాలోచనలు జరిపారట. వారం రోజులపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్స్ పై పూర్తి అవగాహన కలిగిన అనంతరం ముందుకొచ్చిన 4 సాఫ్ట్ వేర్  కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. ఒక ఒప్పందం తర్వాత ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసి మూడు మాసాల్లోగా భక్తులకు ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేపడతారట.

టీటీడీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానం ద్వారా భక్తులకు కేవలం గంటలోపుగా శ్రీవారి దర్శనం కల్పించే నూతన విధానాన్ని అమలు కోసం ఇప్పటికే టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను కలిసి పూర్తి వివరాలను అందించారు. 

తిరుమలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానం విజయవంతం అయితే. వాస్తవానికి టిటిడి చరిత్రలో కేవలం గంటలోపు సామాన్య భక్తులకు సైతం స్వామి వారి దర్శనాన్ని కల్పించిన చరిత్ర కేవలం ఒక్క బిఆర్ నాయుడు కే దక్కుతుందని అందరు చెప్పుకుంటున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link