One Nation One Election: కేంద్ర ప్రభుత్వం సంచలనం.. జమిలి ఎన్నికలతో తీరనున్న మోదీ కల
One Nation One Election: త్వరలోనే దేశంలో అసెంబ్లీ, పార్లమెంట్‌లకు ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. జమిలి ఎన్నికలు (లోక్‌సభ, అసెంబ్లీలకు కలిపి) నిర్వహించాలనే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది.
One Nation One Election: దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రూపొందించిన నివేదికను తాజా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం సంచలనం రేపింది.
One Nation One Election: నివేదిక ఆమోదంతో నరేంద్ర మోదీ కలగన్న 'ఒక దేశం- ఒక ఎన్నిక' (వన్ నేషన్ వన్ ఎలక్షన్)కు త్వరలోనే సాకారం కానుంది.
One Nation One Election: వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. అయితే రాజ్యసభలో ఈ బిల్లు వీగిపోయే ప్రమాదం పొంచి ఉంది.
One Nation One Election: దేశంలో విడతల వారీగా రాష్ట్రాలు, లోక్‌సభకు ఎన్నికలు నిర్వహిస్తుండడంతో ప్రజాధనం వృథా అవుతుందనే వాదన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ కీలకమైన అంశానికి తాజాగా ఆమోదం తెలపడంతో దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయే అవకాశం ఉంది.
One Nation One Election: కాగా జమిలి ఎన్నికలతో నరేంద్ర మోదీ నియంతలాగా దేశాన్ని ఏలాలని చూస్తున్నట్లు కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చైనా, రష్యాలోని పాలకుల మాదిరి మోదీ సర్వం తానే అనే రూపంలో జమిలి ఎన్నికలకు వెళ్తున్నారని ప్రచారం జరుగుతోంది.
One Nation One Election: జమిలి ఎన్నికలతో సమయం, డబ్బు వృథా అవుతుంది. కానీ అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఎదురించే అవకాశం ఉండదనే అభిప్రాయం ప్రజాస్వామ్యవాదుల్లో ఆందోళన కలిగిస్తోంది.