Nirmala Sitharaman Education: ఆర్దిక మంత్రి నిర్మల సీతారామన్ బాల్యం ఎక్కడ గడిచింది, ఎంతవరకూ చదువుకుంది

Tue, 23 Jul 2024-7:20 pm,

ప్రైమరీ ఎడ్యుకేషన్

నిర్మలా సీతారామన్ స్కూల్ ఎడ్యుకేషన్ అంతా మద్రాస్, తిరుచునాపల్లిలో జరిగింది. బాల్యం నుంచే చదువు, రాజకీయాలపై ఆమెకు ఆసక్తి ఎక్కువ. తండ్రి బదిలీ కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో నివసించారు.

నిర్మలా సీతారామన్ 2003-2005 వరకూ జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలిగా పనిచేశారు. ఆ తరువాత 2006లో బీజేపీలో చేరింది. ఆ సమయంలో ఆమె భర్త పరకాల ప్రభాకర్ ప్రజారాజ్యం పార్టీలో ఉన్నారు.

1980లో తమిళనాడులోని తిరుచునాపల్లిలో సీతా లక్ష్మి రామస్వామి కళాశాలలో ఎకనామిక్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత 1984లో జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ నుంచి ఎంఏ ఎకనామిక్స్, ఎంఫిల్ పూర్తి చేశారు. 

ఎంఏ తరువాత ఎకనామిక్స్ లో ఇండియా-యూరప్ వ్యాపారంపై ఫోకస్ పెట్టడంతోపాటు పీహెచ్‌డీ చేయాలనుకున్నారు. అడ్మిషన్ కూడా తీసుకున్నారు. కానీ ఆమె భర్తకు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి స్కాలర్ షిప్ రావడంతో నిర్మల భర్తతో పాటు లండన్ వెళ్లింది. 

మధురలోని అయ్యంగార్ కుటుంబంలో

నిర్మలా సీతారామన్ 1959 ఆగస్టు 18వ తేదీన తమిళనాడు మధురలోని నారాయణ్ సీతారామన్, సావిత్రీ దేవి ఇంట్లో జన్మించారు. తండ్రి ఆనాడు రైల్వేలో ఉద్యోగం కావడంతో ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంది కుటుంబం.

నిర్మలా సీతారామన్ మొదట్లో ఆంధ్రప్రదేశ్ విభాగం అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఆ తరువాత నితిన్ గడ్కరీ పార్టీ బాధ్యతలు చేపట్టాక జాతీయ స్థాయిలో పార్టీ ప్రకటించిన ఆరుగురు అధికార ప్రతినిధుల్లో ఒకరిగా ఉన్నారు.

నిర్మలా సీతారామన్ 2003-2005 వరకూ జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలిగా పనిచేశారు. ఆ తరువాత 2006లో బీజేపీలో చేరింది. ఆ సమయంలో ఆమె భర్త పరకాల ప్రభాకర్ ప్రజారాజ్యం పార్టీలో ఉన్నారు.

వివిధ చర్చా కార్యక్రమాల్లో పార్టీ తరపున పాల్గొంటుూ అత్యంత సమర్ధవంతంగా పార్టీ తరపున మాట్లాడేది. బీజేపీలో సమర్ధవంతమైన అధికార ప్రతినిదిగా మారిపోయారు. 2014 ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు. 2014లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఏపీ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. కేంద్ర మంత్రి అయ్యారు.

2016 కర్ణాటకలో జరిగిన ఉపఎన్నికలో గెలిచి లోక్ సభకు చేరారు. 2017 లో కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రక్షణశాఖ మంత్రిగా పనిచేశారు.  2017-2019 వరకూ ఆ పదవిలో ఉన్నారు. ఆ తరువాత 2019లో మోదీ 2.0 ప్రభుత్వంలో తొలిసారి ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పట్నించి ఆ భాద్యతలు నిర్వహిస్తున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link