Diwali Bonus: కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దీపావళి సందర్భంగా భారీ బోనస్ ప్రకటన.. ఎవరు అర్హులంటే.?

Mon, 14 Oct 2024-3:40 pm,

Diwali Bonus: దీపావళి పండగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే వార్తను అందించింది కేంద్ర ప్రభుత్వం. 2023-24 సంవత్సరానికి గాను స్పెషల్ దీపావళి బోనస్ ను ప్రకటించింది. నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ లేదా అడ్ హాక్ బోనస్ గా పేర్కొనే ఈ బోనస్ ను అక్టోబర్ 10న విడుదల చేసినట్లు అధికారిక ఆర్డర్ లో వెల్లడించింది. ఈ బోనస్ ఎలా కాలిక్యులేట్ చేస్తారు. అర్హులు ఎవరో తెలుసుకుందాం.  

ఎలాంటి ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ స్కీంలో భాగం కాని గ్రూప్ సి ఉద్యోగులు, నాన్ గెజిటెడ్ గ్రూప్ బి ఉద్యోగులకు బోనస్ అందిస్తారు. సెంట్రల్ పారా మిలిటరీ ఫోర్సెస్, సాయుధ దళాల సిబ్బంది, కేంద్ర ప్రభుత్వ వేతనవ్యవస్థను అనుసరించే కేంద్ర పాలిత ప్రాంతాల ఉద్యోగులకు కూడా బోనస్ ఇస్తారు.   

బోనస్ అనేది ఉద్యోగి 30 రోజుల వేతానికి జీతంతోపాటు అలవెన్సులు కలిపి ఇస్తారు. అయితే బోనస్ ను కాలిక్యులేట్ చేసేందుకు ఉపయోగించే గరిష్ట జీతం నెలకు రూ. 7,000గానిర్ణయించారు. ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఒక ఉద్యోగి నెలలవారీ జీతం రూ.7,000అయితే బోనస్ మొత్తం సుమారు రూ.6,908 అవుతుంది.   

ఉద్యోగులు దీపావళి బోనస్ పొందేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని నిర్దిష్ట అర్హతలు తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. ఉద్యోగులు తప్పనిసరిగా 2024 మార్చి 31నాటికి సర్వీసులో ఉండాల్సిందే.  ఆర్ధిక ఏడాదిలో కనీసం 6నెలలపాటు కంటిన్యూగా సర్వీసు చేసి ఉండాలి.   

పూర్తి సంవత్సరం కంటే తక్కువ పని చేసిన ఉద్యోగులకు, ప్రోరేటా ప్రాతిపదికన బోనస్ ఇస్తారు. అంటే వారు ఎన్ని నెలలు పనిచేశారో బట్టి వారు బోనస్ లో కొంత భాగాన్ని ఉద్యోగులకు చెల్లిస్తారు.   

వరుసగా మూడు ఏండ్లు, ఒక ఏడాదిలో కనీసం 240 రోజులు పనిచేసిన సాధారణ కార్మికులు కూడా బోనస్ కు అర్హులు అవుతారు. వీరికి బోనస్ నెలకు రూ. 1,200గా లెక్కిస్తారు.   

దీపావళి బోనస్ ఎలా కాలిక్యులేట్ చేస్తారంటే బోనస్ మొత్తం సగటు పారితోషికాన్ని 30.4తో విభజిస్తారు. ఆపై దాన్ని 30 తో మల్టిప్లై చేయడం ద్వారా కాలిక్యులేట్ చేస్తారు. నెలకు రూ. 7000 జీతం తీసుకునే వ్యక్తికి దీపావళి బోనస్ ఎంత లభిస్తుందంటే 7000*30.4=రూ. 6,908   

అన్ని పేమెంట్స్ ను సమీపం మొత్తంలోని రౌండ్ ఫిగర్ వ్యాల్యూని నిర్ణయిస్తారు. సంబంధిత మంత్రిత్వ శాఖ లేదా విభాగాలు ఆమోదించిన బడ్జెట్ లోనే ఈ బోనస్ ఖర్చును భరిస్తుంటాయి.   

కొంత కాలంగా దాదాపు అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. పండగల సమయంల నెలలవారీ ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. బడ్జెట్ మెయింటెన్ చేస్తూ పండగల ఖర్చులను భరించడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బోనస్ ఉద్యోగులకు మరింత సహకారం అందిస్తుంది. అదనపు ఆర్థిక భద్రతతో పండగ సీజన్ ను ఎంజాయ్ చేయడంలో ఉద్యోగులకు సహాయపడుతుంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link