Nara Rammurthy Naidu:నారా రోహిత్ తండ్రి గురించి షాకింగ్ నిజాలు.. ఒకప్పుడు ఆయనకే వ్యతిరేకంగా!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు కొన్ని గంటల క్రితం మరణించారనే విషయం తెలియగానే అటు అభిమానులు, ఇటు కార్యకర్తలు సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. రామ్మూర్తి నాయుడు గత రెండు మూడు ఏళ్ల నుంచి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారట. వైద్యులు వెంటిలేటర్ పైన ఉంచి చికిత్స చేస్తున్నప్పటికీ మృతి చెందినట్లు సమాచారం.
ఈ విషయం తెలియగానే.. తన అన్న చంద్రబాబు నాయుడు హుటాహుటిగా అన్ని కార్యక్రమాలను సైతం రద్దు చేసుకొని మరీ హైదరాబాద్ కి వెళ్ళారు. ఇక ఈ విషయం అందరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది ఇకపోతే రామ్మూర్తి నాయుడు మరణాన్ని అభిమానులు కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక రామ్మూర్తి నాయుడు.. కుమారుడు ఎవరో కాదు ప్రముఖ సినీ హీరో నారా రోహిత్. ఈయన వివాహం కూడా మరి కొద్ది రోజులలో జరగాల్సి ఉండగా.. ఇలాంటి దుర్ఘటన జరిగింది. ఇటీవల నారా రోహిత్ ఎంగేజ్మెంట్ కూడా చాలా గ్రాండ్ గానే జరిగింది.
రామ్మూర్తి నాయుడు రాజకీయాల విషయానికి వస్తే.. 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి టిడిపి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత రాజకీయాలలో విభేదాలు రావడంతో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. రాజకీయాల వల్ల అన్నదమ్ముల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ.. కుటుంబంలో మాత్రం ఎప్పుడూ కూడా స్నేహపూర్వకంగానే ఉండేవారట రామ్మూర్తి నాయుడు. చంద్రబాబు కూడా తన తమ్ముడి కుమారుడు రోహిత్ సినీ కెరియర్ కి ఎప్పుడు అండగానే ఉండేవారట. గత కొన్నేళ్లుగా రామ్మూర్తి నాయుడు రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ.. గత ప్రభుత్వం వైసీపీ పాలనలో రాజకీయ ప్రయోజనం కోసం ఈయన ఉపయోగించుకునే ప్రయత్నం చేశారట.
ఇదిలా ఉండగా 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జూనియర్ ఎన్టీఆర్ మామగారు నార్ని శ్రీనివాసరావును తీసుకొచ్చి, చంద్రబాబు నాయుడు పై విపరీతమైన ఆరోపణలు చేయించారు.ముఖ్యంగా చంద్రబాబు తన సోదరుడు రామ్మూర్తి నాయుడును పట్టించుకోవడం లేదని , గొలుసులు తాళ్లతో కట్టివేసి మరి చిత్రహింసలకు గురి చేస్తున్నారని శ్రీనివాసరావు ఆరోపించారు.
అయితే 2019లో ఈ ఆరోపణలు దావాణంలా వ్యాపించి టిడిపికి కొంత నష్టం కూడా కలిగించాయి. అయితే ఈ ఆరోపణలను నారా రోహిత్ కొట్టి పారేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిపై రాజకీయాలు చేయడం దారుణమని ఆయన తెలిపారు. ఇకపోతే రామ్మూర్తి అంత్యక్రియలు వారి స్వగ్రామమైన నారావారిపల్లెలో జరగనున్నాయి.