Unstoppable With NBK Season4: బావ బామ్మర్దుల టాక్ షోకు డేట్, టైమ్ ఫిక్స్.. మరోసారి బాలయ్య షోలో చంద్రబాబు..

Mon, 21 Oct 2024-6:39 am,

నందమూరి నట సింహాం బాలకృష్ణ హోస్ట్ గా వ్యహరిస్తోన్న అన్ స్టాపబల్  సీజన్ 4కు రంగం సిద్ధం అయింది. సీజన్ 4 తొలి ఎపిసోడ్ లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రారంభం కానుంది. గతంలో రెండో సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ కూడా చంద్రబాబుతో ప్రారంభం కావడం విశేషం.

అపుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఈ టాక్ షోకు వస్తే.. ఈ సారి ముఖ్యమంత్రిగా ఈ టాక్ షోకు హాజరయ్యారు. తాజాగా ఈ టాక్ షోకు సంబంధించిన షూటింగ్ ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది.

అయితే.. ప్రతిపక్ష నేతగా బాలయ్య, చంద్రబాబును అడిగిన ప్రశ్నలకు.. ఇపుడు ఏపీ ముఖ్యమంత్రిగా కూటమిగా ప్రభుత్వ అధినేతగా ఉన్నారు. అంతేకాదు  పైగా  కేంద్రంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వంలో రెండో అతిపెద్ద పార్టీ నేతగా చక్రం తిప్పుతున్నారు.

ఈ నేపథ్యంలో జరగిగన ఈ టాక్ షో ఎలా ఉండబోతుందో అని నందమూరి, నారా అభిమానులతో పాటు ఇరు రాష్ట్రాల ప్రజలు కూడా ఈ టాక్ షో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  ఈ టాక్ షో ఈ నెల 25న రాత్రి 8.30 గంటలకు ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

మరోవైపు బాలకృష్ణ కూడా వరుసగా హాట్రిక్ సినిమాల విజయాలతో పాటు వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చేస్తోన్న ఎపిసోడ్ కావడంతో చంద్రబాబు నాయుడు.. తన వియ్యంకుడైన బాలయ్యను తిరిగి ఎలాంటి ప్రశ్నలు వేస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

ఈ సీజన్ లో చంద్రబాబుతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లతో పాటు దుల్కర్ సల్మాన్,  రామ్ చరణ్ తో పాటు కొంత మంది పొలిటికల్, యంగ్ హీరోలు ఈ సీజన్ లో సందడి చేయబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే మూడు సీజన్లు దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరి ఈ సీజన్ 4 ఎలా ఉండబోతుందో చూడాలి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link