Urvashi rautela : ఊర్వశి రౌతేలా ధరించిన ఆ గౌను ధరతో ఓ ఇళ్లు కొనుగోలు చేయవచ్చు

Thu, 07 Jan 2021-6:22 pm,

స్పెషల్లీ డిజైన్ గౌను ద్వారా ఊర్వశి రౌతేలా చర్చల్లో ఉందిప్పుడు..

ప్రముఖ అంతర్జాతీ. డిజైనర్ మైకేల్ సిన్కో (  Michael Cnco ) ఈ గౌను తయారు చేశాడు. రెడ్ కలర్‌లోని ఈ గౌనులో ఊర్వశి నిజంగానే పైనుంచి దిగివచ్చిన ఊర్వశిలా కన్పిస్తోంది. 

ఊర్వశి డిజైన్ చేయించుకుని ధరించిన ఈ గౌను ధర ఎంతో తెలుసా...ఆశ్చర్యపోతారు. ఆ డబ్బులతో ఓ లగ్జరీ ఇల్లు కొనుగోలు చేయవచ్చు మరి.

డిజైనర్ మైకేల్ సిన్కో ఈ గౌను ధర గురించి..తయారు చేయడానికి పట్టిన సమయం గురించి వివరించాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ ఊర్వశి రౌతేలా ఈ రెడ్ కలర్ గౌను ధరించి న్యూ ఇయర్ ఈవెంట్‌లో హల్‌చల్ చేసిందని చెప్పాడు.

ఈ గౌను ధర 45 వేల అమెరికన్ డాలర్లను మైకేల్ చెప్పుకొచ్చాడు. అంటే అక్షరాలా 33 లక్షల కంటే ఎక్కువే మరి. 

ఐశ్వర్యా రాయ్ బచ్చన్ డ్రెస్ కూడా మైకేల్ సిన్కోనే డిజైన్ చేశాడు. ఆ డ్రెస్‌ను ఐశ్వర్యా రాయ్..కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ధరించి..తన అద్బుతమైన సౌందర్యంతో చర్చనీయాంశమైంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link