Donald Trump: భారతీయులకు ఖుషీ కబురు చెప్పిన డొనాల్డ్ ట్రంప్..వారిని వెళ్లగొట్టి..వీరిని అక్కున చేర్చుకుంటా అంటూ కామెంట్స్
Donald Trump: అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పారు. ట్రంప్ అధికారంలోకి వస్తే భారతీయులకు ఇబ్బందులు తప్పవని ఇన్నాళ్లూ ఆందోళన చెందిన వారికి ట్రంప్ వ్యాఖ్యలు ఉపశమనం కల్పించినవని చెప్పవచ్చు.
ఎందుకంటే తాజాగా ట్రంప్ ఎన్ బి సి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు వెల్లడించారు. అమెరికాలో సాధికారికంగా ప్రవేశం పొందాలనుకునేవారు ఈ దేశాన్నే ప్రేమించాలి. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంటే ఏమిటో చెప్పాలి అన్నారు ట్రంప్.
కొన్ని దేశాల జైళ్ల నుంచి నేరస్తులు నేరుగా అమెరికాకు వస్తున్నారని అలాంటి 13, 099 మంది నేరస్తులు అమెరికా వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఈ ప్రమాదకర వ్యక్తులను మన దేశంలో ఉండనివ్వకూడదన్న ట్రంప్ వెంటనే వారికి వెళ్లగొట్టలని చెప్పారు.
అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన తల్లిదండ్రుల సంతానంలో చాలా మంది ఇక్కడే పుట్టి పెరిగారని..వారిలో చాలా మంది గొప్ప గొప్ప ఉద్యోగులు, వ్రుత్తులో ఉన్నారన్నారు. వారి సమస్యను పట్టించుకుంటానని స్పష్టం చేశారు.
ప్రతిపక్ష డెమోక్రాట్లతో కలిసి ఒక పరిష్కారం కనుగొంటానని ట్రంప్ వివరించారు. పొరుగు దేశాలైనా కెనడా, మెక్సికోల నుంచి అమెరికాలోకి లక్షల మంది అక్రమ వలసదారులు పొటేత్తుతున్నారని దీన్ని కంట్రోల్ చేయకపోతే ఈ రెండు దేశాలపై 25శాతం సుంకాలు విధిస్తానని ట్రంప్ ఈ మధ్యే ప్రకటించారు.
దీనిపై రెండు దేశాలు హాహాకారాలు చేశాయి. కెనడా, మెక్సికోలు అమెరికాలో 51, 52వ రాష్ట్రాలుగా చేరిపోవడం మంచిదన్నారు. అమెరికా ఇప్పటికే కెనడాకు 10,000కోట్ల డాలర్లు, మెక్సికోకు 30,000కోట్ల డాలర్ల చొప్పున రాయితీలు ఇస్తుందని..వీటిని కట్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
చైనా తదితర దేశాలపై సుంకాలు పెంచితే సరుకుల ధరలు పెరిగి సామాన్య అమెరికన్ పౌరులు నష్టపోతారని కంపెనీల సీఈఓలు కొందరు చేస్తున్న హెచ్చరికలను ట్రంప్ తోసిపుచ్చారు. ట్యాక్స్ సాయంతో తాను యుద్ధాలను ఆపానని తెలిపారు.