Uses of Ground Amla: వర్షాకాలంలో మోలిచే ఈ మొక్కను ఇలా వాడితే.. మీ లివర్ వందేళ్లు సురక్షితం
Ground Amla Benefits : ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సితోపాటు మరెన్నో పోషకాలు ఉంటాయి. జీర్ణక్రియకు కూడా ఎంతో మేలు చేస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే నేల ఉసిరి గురించి ఎంత మందికి తెలుసు. దీని వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. నేల ఉసిరిని తినడం వల్ల మీ లివర్ ఆరోగ్యం చక్కగా కాపాడుకోవచ్చని చాలా మందికి తెలియదు. నేల ఉసిరి అనేది భూమి పండుతుంది. చిన్న సైజులో ఉంటుంది. తినడానికి అంత రుచిగా అనిపించకపోయినా.. అద్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇందులో ఉంటాయి. ఈ శక్తివంతమైన పండు తిని మీ లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు.
నేల ఉసిరితోపాటు గలిజేరు ఆకులు, వేప ఆకులు కలిపి తింటే గ్యాస్ట్రిక్ సమస్యలు దూరం అవుతాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. కాలేయం అద్భుతంగా పనిచేస్తుంది. అయితే వీటిని తినే ముందు అనుభవం ఉన్న వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే వీటిని తినాలి.
బెస్ట్ లివర్ టానిక్ : ఈ నేల ఉసిరికి మరో పేరు ఫిల్లాంతస్ నీరూరి. దీనితో చేసిన ఔషధాన్ని బెస్ట్ లివర్ టానిక్ అని చెబుతారు. లివర్‌ను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా పనితీరును కూడా డెవలప్ చేస్తుంది. కామెర్లు వంటి సమస్యలు ఉన్నప్పుడు చికిత్స అందిస్తారు. ఈ కాయ వినియోగంతో అద్బుతమైన ఫలితాలను కూడా పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
పోషకాలు : ఇందులో ఉండే విటమిన్ సి అత్యున్నత స్థాయిలో ఉండటం వల్ల శరీరాన్ని పూర్తిగా ఆరోగ్యంగా ఉంచుతుంది. లివర్ సమస్యలను తగ్గించడంలో, జ్వరానికి కామెర్లకు మంచి ఔషధంగా సమర్ధవంతంగా పనిచేస్తుంది. వీటిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ యాంటీ బయోటిక్ యాంటీ ఆస్తమాటిక్ గుణాలు శ్వాస సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంటాయి. ఫలితంగా జలుబు, గొంతు నొప్పి, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలు రావు.
నేల ఉసిరి చాలా మంది శరీర తీరుకు సరిపోతుంది. మీ హెల్త్ రోటిన్‌లో చేర్చుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. కానీ వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే వీటిని తినాలి. లేదంటే ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా గర్భిణీలు, పిల్లలకు పాలిచ్చే స్త్రీలు కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాలని గుర్తుంచుకోండి.