Utpanna Ekadashi 2024: ఉత్పన్న ఏకాదశి.. రేపు ఈ ఒక్క పనిచేస్తే కటిక దరిద్రులు కూడా కోటీశ్వరులవ్వడం పక్కా..
సాధారణంగా మనకు ఏడాది పాటు అనేక తెలుగు నెలలు ఉంటాయి. కానీ వాటన్నింటిలో కార్తీక మాసం చాలా పవిత్రమైందంట. ఈ మాసంలో విష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొంటాడంటారు.
ముఖ్యంగా.. శివ, కేశవుల్ని ఈ మాసంలో ఎక్కువగా ఆరాధిస్తారు. దీపారాధన, నదీస్నానం, దానం, జపాలు ఈ మాసంలో చెప్పుకొదగ్గవిగా ఉన్నాయి. అయితే.. కార్తీక మాసం ప్రస్తుతం అయిపోవడానికి వస్తుంది. ఈనేపథ్యంలో చాలా అరుదైన ఏకాదశి రాబోతుంది.
అంటే.. నవంబర్ 26న శక్తివంతమైన ఉత్పన్న ఏకాదశి రాబోతుంది. ఈ తిథి విష్ణుదేవుడికి ఎంతో ప్రీతీకరమైందంట. సంవత్సరానికి 26 ఏకాదశి తిథులు వస్తుంటాయి. కానీ కార్తీకంలో వచ్చే ఈ ఏకాదశి వల్ల గొప్ప ఫలితాలు కల్గుతాయంట.
వీటితో ఉత్పన్న ఏకాదశి అతి ముఖ్యమైందంట. ఈ రోజున విష్ణువుకు ఐదు రకాల ఫలాలతో అభిషేకం చేయాలంట. ఈరోజు దేవుడికి అన్నం మొదలైనవి నైవేద్యం ఉండదు. కాబట్టి.. ఐదు రకాల పండ్లు, ఐదు రకాల స్వీట్లతో నైవేద్యం చూపించాలంట. వీటిని పేదలకు ,అన్నార్థులకు పంచారలంట.
ఉత్పన్న ఏకాదశి.. నవంబరు 26న ఉదయం 3 గంటలకు ప్రారంభమై.. అర్ధరాత్రి వరకు ఈ తిథి ఉందంట. అందుకే..ఈ సమయంలో మనం శివుడు, కేశవుల ప్రీతీకొరకు పూజలు చేస్తే మంచి ఫలితాలు ఇస్తాయి.
ముఖ్యంగా శివుడి కోసం అభిషేకాలు, విష్ణుదేవుడి అనుగ్రహం కోసం.. విష్ణు సహస్రనామం పారాయణం, తులసీ దళాలు, మాలలతో అలంకరణం, సత్యనారాయణ వ్రతాలు చేస్తే.. ఎంత కటిక దరిద్రుడిలా ఉన్న.. కోటిశ్వరులౌతారంట. అంతటి గొప్పదైన ఈ తిథిని భక్తులు అస్సలు వదులు కొవద్దని, తమకు తోచిన విధంగా దైవకార్యాలు చేయాలని పండితులు సూచిస్తున్నారు.