Samantha: సమంతతో నటించొద్దు.. వరుణ్ ధావన్ కి వార్నింగ్.. అసలేమైందంటే..?

Tue, 22 Oct 2024-4:10 pm,

అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకొని,  ఇప్పుడు నిర్మాతగా మారిన సమంత బాలీవుడ్లో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది.ఇందులో ఈమెకు జోడిగా వరుణ్ ధావన్ నటిస్తున్న విషయం తెలిసిందే.  అయితే ఈ వెబ్ సిరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు చాలామంది ఇండస్ట్రీలోని సెలబ్రిటీస్ సమంతతో నటించొద్దని తనకు చెప్పినట్లు వరుణ్ ధావన్ ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చారు. 

వరుణ్ ధావన్ మాట్లాడుతూ.. ‘చాలామంది నాకు ఎన్నో సలహాలు ఇచ్చారు.. సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది సమంతతో నటించవద్దని.. అలా చేస్తే నీకున్న క్రేజ్ పోతుందని’ వార్నింగ్ ఇచ్చారు. 

అయినా సరే నేను వారి మాటలు లెక్క చేయలేదు సమంతతో నటించాను. ఆమె వంటి టాలెంటెడ్ యాక్టర్ తో నటించడం చాలా సంతోషంగా ఉంది. హీరోలకు దీటుగా ఆమె చేసిన ఫైట్స్ ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ తెప్పిస్తాయి.   

ముఖ్యంగా ఈగ సినిమాలో ఆమెనుటకు నేను ఫిదా అయిపోయాను. అప్పట్నుంచే సమంత అంటే నాకు విపరీతమైన అభిమానం. ఇప్పుడు సమంతతో నటించే అవకాశం వచ్చినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను అంటూ తెలిపారు వరుణ్ ధావన్.

ఇకపోతే ఎవరు ఎన్ని రకాలుగా నన్ను వెనక్కి లాగే ప్రయత్నం చేసినా నేను మాత్రం సమంతతో నటించడం ఆపలేదు ..ఇక ఆమె నుండి ఎన్నో నేర్చుకున్నాను అంటూ తెలిపారు వరుణ్ ధావన్. ప్రస్తుతం సమంత విషయంలో వరుణ్ ధావన్ కి ఎవరు ఇలాంటి  వార్నింగ్ ఇచ్చారు అనే విషయంపై వరుణ్ నోరు విప్పలేదు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link