Varun Tej: అర్థం కానీ అమ్మాయితో పెళ్లి జరిగితే బతుకు బస్టాండే.. బాంబు పేల్చిన వరుణ్ తేజ్.. అసలేం జరిగిందంటే..?
టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం మట్కా మూవీ ప్రమోషన్స్ లలో బిజీగా ఉంటున్నారు. ఈ మూవీని కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అదే విధంగా..ఈ మూవీలో..మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
మట్కా మూవీ నవంబరు 14 ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ మూవీ కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్లు మూవీ టీమ్ చెబుతుంది. అంతే కాకుండా.. ఈ మూవీలో హీరో వరుణ్ తేజ్ తో స్క్రీన్ పంచుకొవడం ఆనందంగా ఉందని నటి.. నోరా ఫతేహీ చెప్పారు.
తాజాగా, ఈ మట్కా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ తేజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. పెళ్లి విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలన్నారు. సరైన అమ్మాయితో పెళ్లి జరక్కుంటే.. బతుకు బస్టాండే అన్నారు. అంతేకాకుండా.. లైఫ్ లో పెళ్లి అనేది గొప్ప టర్నింగ్ పాయింట్ అని అన్నారు.
పెళ్లికి ముందు ఫ్రెండ్స్ తో ఫుల్ ఎంజాయ్ చేసేవాడినని, కానీ మిత్రులు ఎల్లకాలం ఉండరని, మంచి పార్టనర్ ఉండాలని..మన కష్టసుఖాలు, వారితో పంచుకొవచ్చాన్నారు.అందుకే తాను ఏడేళ్లు ప్రేమించుకుని, పెద్దల అంగీకారంలో పెళ్లి చేసుకున్నామని చెప్పారు.
గతేడాది వరుణ్ తేజ్ కు లావణ్య త్రిపాఠికి పెళ్లి జరింగిందన్న విషయం తెలిసిందే. తాముఎంతో హ్యాపీగా ఉన్నామని, తనను లావణ్య ఎంతో అర్థం చేసుకుందని కూడా చెప్పుకొచ్చాడు. లావణ్య లేని జీవితంను తాను ఊహించుకోలేనని వరుణ్ ఎమోషలన్ అయినట్లు తెలుస్తొంది.
అయితే.. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇటీవల జూబ్లిహిల్స్ లో మాజీప్రధాని పీవీ నర్సింహారావ్ ఉంటున్న ఇంటిలోకి మారినట్లు తెలుస్తొంది. అక్కడకు వెళ్లాకే పీవీ ప్రధాని అయ్యారంట. ఆతర్వాత ఈ ఇల్లును.. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అద్దెకి తీసుకుంది. నాగబాబు , లావణ్య త్రిపాఠి, నిహారిక కూడా ఈ ఇంటికి షిఫ్ట్ అయినట్లు తెలుస్తొంది. ఇక ఈ ఇంటి ఇంటీరియర్స్ కోసం కోటిన్నర నుండి రెండు కోట్లు ఖర్చు పెట్టారని వార్తలు కూడా వస్తున్నాయి.