Vastu Plants: వాస్తు ప్రకారం ఈ మొక్కల్ని ఉత్తర దిశలో నాటితే అంతా లాభమే
ఇంటి ఉత్తర దిశలో ఇంటి బయట కూడా కొన్ని మొక్కలు నాటడం మంచిది. ఈ మొక్కల్ని నాటడం వల్ల ఇంటి పరిసరాల్లో మంచి జరుగుతుంది.
ఇంటి ఉత్తర దిశలో పలుచటి ఆకులుండే మొక్కను నాటడం చాలా ప్రయోజనకరమంటారు. వాస్తు పండితుల ప్రకారం ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది.
వాస్తు శాస్త్రంలో మనీ ప్లాంట్‌లానే జెడ్ ప్లాంట్‌కు మహత్యముంది. ఈ మొక్క డబ్బుల్ని ఆకర్షిస్తుందని అంటారు. లేదా కుబేరుడి కటాక్షం కలుగుతుందంటారు. అందుకే ఈ మొక్కను ఇంటికి ఉత్తర దిశలో అమర్చాలంటారు.
ఇంటి ఉత్తర దిశలో మనీ ప్లాంట్ అమర్చడం చాలా మంచిదని నమ్మకం. ఈ దిశలో మనీ ప్లాంట్ నాటడం వల్ల వ్యక్తి జీవితంలో ఎప్పుడూ డబ్బులకు కొదవ ఉండదు. మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమౌతాయి. వ్యక్తికి ఆర్ధిక ఇబ్బందులు ఉండవు
వాస్తు పండితుల ప్రకారం ఇంటి ఉత్తర దిశలో అందమైన మొక్కలు అమర్చాలి. ఇంటికి అందం వస్తుంది.
ఇంటి ఉత్తర దిశ అనేది కుబేరుడి స్థానం. బుధ గ్రహం దిశ కూడా ఇదే. ఈ దిశలో విజ్ఞానం, బుద్ధి ప్రాప్తిస్తాయి. ఈ దశలో ఏదైనా వస్తువులుంచితే ఆ వ్యక్తికి అభివృద్ధి మార్గాలు తెర్చుకుంటాయంటారు. ఈ దిశలో మొక్క నాటితే మంచి జరుగుతుందని ప్రతీతి.
ఇంట్లో మొక్కలు పెంచడం వల్ల ఇంటికి అందం పెరగడమే కాకుండా ఆ ఇంట్లోపాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుందనేది చాలామంది నమ్మకం. కానీ మొక్కల్ని ఏ దిశలో పడితే ఆ దిశలో ఉంచకూడదు. వాస్తు ప్రకారం ఏ మొక్కను ఏ దిశలో ఉంచాలో వివరంగా ఉంది. సరైన దిశలో సరైన మొక్కను అమర్చితే పాజిటివ్ పరిణామాలు ఎదురౌతాయని నమ్మకం.