Venus And Saturn Effect: డిసెంబర్ 28వ తేది నుంచి ఈ రాశులవారికి డబ్బే..డబ్బు! తిరుగులేదు ఇంక..
ఇదిలా ఉంటే త్వరలోనే కుంభరాశిలో శుక్రుడు, శని గ్రహాల కలయిక జరగబోతోంది. ఈ కలయికను జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఎందుకంటే ఈ రెండు శక్తివంతమైన గ్రహాలు కాబట్టి.. ఈ రెండు గ్రహాలు కలయిక వల్ల కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
డిసెంబర్ 28వ తేదీన కుంభ రాశిలో శుక్ర గ్రహంతో పాటు శని గ్రహం కలయిక జరుగబోతోంది. ఇది డిసెంబరు 28వ తేదీ రాత్రి 11 గంటలకు జరుగుతోంది. అయితే ఈ రెండు గ్రహాల కలయిక జరగడం కొన్ని రాశులకు ఎంతో శుభప్రదం అని చెప్పవచ్చు.
శని, గ్రహాల కలయిక కారణంగా వృషభ రాశి వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వృషభ రాశి వారు 2025 సంవత్సరం రెండవ నెల వరకు కూడా అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. వీరు ప్రస్తుతం కొనసాగుతున్న జాబ్‌లో ప్రమోషన్స్ లభించడమే కాకుండా కొత్త జాబ్ ఆఫర్స్ కూడా లభిస్తాయి.
అలాగే వృషభ రాశి వారికి వ్యాపారంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల సపోర్టు లభించడమే కాకుండా ఆగిపోయిన పనులు కూడా వెంట వెంటనే పూర్తవుతాయి. అలాగే ఈ పనిలో విజయాలు సాధించిన సమాజంలో మంచి పేరును పొందుతారు.
శని, శుక్ర గ్రహాల కలయిక కారణంగా కుంభరాశి వారు కూడా డిసెంబర్ 28వ తేదీ నుంచి అద్భుతమైన లాభాలు పొందుతారు. వీరికి సమాజంలో గౌరవం లభించడమే కాకుండా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి జీతాలు పెరిగి ప్రమోషన్స్ కూడా లభిస్తాయి.
అలాగే కుంభరాశిలో ఈ రెండు గ్రహాల కలయిక జరగబోతోంది. కాబట్టి స్థానికంగా సింగిల్స్‌కి వివాహాలు కూడా జరుగుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడులు కూడా ఈ సమయంలో సులభంగా పూర్తవుతాయి. అంతేకాకుండా ఎలాంటి పని తలపెట్టిన అద్భుతమైన విజయాలు సాధిస్తారు. అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.
శని శుక్ర గ్రహాల కలయిక కారణంగా తులా రాశి వారికి డిసెంబర్ నెల చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా కష్టమైన పనులు కూడా తులా రాశి వారు ఎంతో సులభంగా చేయగలుగుతారు. ఇక కార్యాలయాల్లో వీరు అద్భుతమైన పేరును సాధిస్తారు. దీనివల్ల వీరికి ప్రమోషన్స్ కూడా రావచ్చు.
తులారాశి వారు కెరీర్ పరంగా ఉన్న అడ్డంకులన్నీ తొలగించుకోబోతున్నారు. అలాగే తులా రాశి వారికి ఆరోగ్యపరంగా కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. వీరికి కుటుంబ సభ్యుల సపోర్టు లభించి వారసత్వంగా వస్తున్న ఆస్తులు కూడా సులభంగా పొందగలుగుతారు. ఇక విద్యాపరంగా వీరికి డిసెంబర్ నెల చాలా అద్భుతంగా ఉంటుంది.