VHP: 60 వసంతాలు పూర్తి చేసుకున్న విశ్వహిందూ పరిషత్.. వీ హెచ్ పి ప్రస్థానంలో ఎన్నో మలుపులు..
VHP : స్వాతంత్య్ర అనంతర కాలంలో విదేశీ మతాలు హిందువులను టార్గెట్ చేస్తూ మరి మభ్యపెట్టి మతం మార్చుకుంటూ పోతూ హిందూ సమాజానికి అన్యాయం చేస్తోన్న సమయం అది. ఆ టైమ్ లోనే హిందువులకు అండగా 1964లో అప్పటి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్.. గురూజీగా పిలిచే ఎం.ఎస్.గోల్వాల్కర్, కేవశరామ్ కాశీరామ్ శాస్త్రి, చిన్మయానందా సరస్వతి, ఎస్.ఎస్. ఆప్టే 1964న శ్రావణ బహుళ అష్టమి.. శ్రీకృష్ణజన్మాష్టమి రోజున (29-8-1964) ఆర్ఎస్ఎస్ అనుబంధంగా విశ్వ హిందూ పరిషత్ సంస్థను స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి హిందువుల ఉన్నతి కోసం ఈ సంస్థ నిరంతరం పనిచేస్తూనే ఉంది.
తాజాగా ఈ యేడాదితో షష్ఠ్యాబ్ది ఉత్సవాలు పూర్తి చేసుకొని 61వ యేట అడుగుపెడుతోంది. ముఖ్యంగా హిందూ మత మార్పిడుల నిరోధకంగా ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ముఖ్యంగా మత మార్పిడులు, హిందూ సమాజంలోనే ఆందోళనకరమైన పరిస్థితులను గమనించి ఆనాటి పెద్దలు ఒత్తిడి తీసుకురాగా.. ప్రభుత్వం జస్టిస్ నియోగి కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ నివేదికలో క్రైస్తవుల మత మార్పిడి చేసే పనులను నిలిపివేయాలంటూ నివేదిక ఇచ్చింది. కానీ ఆనాటి ప్రభుత్వం ఈ కమిషన్ నివేదికను బుట్టదాఖలు చేసింది.
ముఖ్యంగా హిందువులు పవిత్రంగా చూసుకుని గోవధను నిషేధించాలని అనేక మంది సాధుసంతులు మాత్రమే కాక గాంధీజీ, వినోబాభావే వంటి వారితో సహా స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న ప్రతివారు చెప్పేవారు. కానీ స్వాతంత్ర్యం సిద్దించిన తర్వాత గో రక్షణను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అంతేకాదు హిందూ సమాజలో భాష, ప్రాంతం, కుల వైరుధ్యాలను సృష్టించి అంతర్గత కలహాలతో కొట్టుకునేలా చేసారు.
హిందూ సమాజం యొక్క రక్షణకు మరియు జాగృతికై ఏదో ఒకటి చేయాలని ప్రతి ఒక్కరి మనస్సులో ఉండేది. అప్పటి కేంద్ర ప్రభుత్వం హిందువుల మత మార్పిడుల గురించి అంతగా పట్టించుకోలేదు. ఆ రోజులలో తన ఉపన్యాసాలతో మేధావి లోకాన్ని సనాతన ధర్మం వైపు వైపు దృష్టి సారించేలా స్వామి చిన్మయానంద్ జీ ప్రవచనాలు అందరిని జాగృతం చేసాయి.
శ్రీ గురూజీ కోరిక మేరకు, దాదాసాహెబ్ ఆప్టే జీ దేశ విదేశాలలో అనుభవం కలిగిన కార్యకర్తలతో సంప్రదించిన తర్వాత 29-30 ఆగస్టు, 1964న శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున ముంబైలోని 'పోవై' ప్రాంతం లోని పూజ్య చిన్మయానంద స్వామి గారి సాందీపని సాధనాలయంలో సమావేశం జరిపారు. ఆ రోజే విశ్వ హిందూ పరిషత్ ఏర్పడింది.
అంతేకాదు దేశంలో ఇతర మతస్తుల చేతిలో అన్యాక్రాంతమైన రామ జన్మభూమి, శ్రీకృష్ణ జన్మభూమితో పాటు కాశీ జ్ఞానవాపి ఆలయాలపై నిరంతరం పోరాటం చేస్తూనే ఉంది. విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ పోరాటాల ఫలితంగానే అయోధ్యలో భవ్య రామ మందిరం సాకారం అయింది. ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా 70 లక్షల మందిపైగా సభ్యులున్నారు.
విశ్వ హిందూ పరిషత్ ముఖ్య లక్ష్యాల విషయానికొస్తే.. హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం మరియు జాగృతం చేయడం. (2) హిందూ సమాజం యొక్క విలువలు, జీవన మూలాలు, హిందూ 'మాన బిందువులను' రక్షించడం మరియు ప్రోత్సహించడం (3) విదేశాలలో ఉన్న హిందువులతో సంబంధాలు పెంచుకోవడం మరియు వారికి ధార్మిక ఆధ్యాత్మిక ఉన్నతి సాధించడానికి తగిన సహాయం అందించడం విశ్వహిందూ పరిషత్ ముఖ్య లక్ష్యాలుగా పనిచేస్తోంది.