Vidadala Rajini: వైఎస్సార్‌సీపీలోనే విడదల రజనీ.. మళ్లీ చిలకలూరిపేట బాధ్యతలు
ఆంధ్రప్రదేశ్ మహిళా రాజకీయ నాయకురాలలో కీలకమైన విడదల రజనీ వైఎస్సార్ సీపీతోనే కొనసాగనున్నారు. తన జగన్ అన్నను వదిలి వెళ్లే యోచన లేదని తేలిపోయింది.
పరిణామాలు తారుమారు: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత మాజీ మంత్రి విడదల రజనీ వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేస్తారనే ప్రచారం జరిగింది.
పుకార్లు: ఆమె పార్టీకి రాజీనామా చేశారని.. త్వరలోనే జనసేనలో కానీ టీడీపీలో కానీ రజనీ చేరుతారనే పుకార్లు వచ్చాయి.
తిరిగి బాధ్యతలు: తాజాగా వైఎస్సార్‌సీపీ అధిష్టానం రజనీకి తిరిగి పాత నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది.
అక్కడ పోటీ: కొన్ని నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిలకలూరిపేట కాకుండా గుంటూరు నుంచి పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో రజనీ ఓటమి చెందారు.
మళ్లీ నియామకం: ఎన్నికలు ముగిసిన దాదాపు ఆరు నెలల తర్వాత తిరిగి రజనీ పాత స్థానమైన చిలకలూరిపేట బాధ్యతలను వైసీపీ అప్పగించింది.
మళ్లీ పాత గూటికే: చిలకలూరిపేట సమన్వయకర్తగా విడదల రజనీని నియమిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటన విడుదల చేసింది.
వజ్రబాబు: తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తగా బాల వజ్రబాబు (డైమాండ్ బాబు)ను వైఎస్సార్‌సీపీ నియమించింది.