Vijay deverakonda: ఆమెను భరించడం నా వల్ల కాదు..!.. పెళ్లి రూమర్స్‌పై బాంబు పేల్చిన విజయ్ దేవర కొండ..?.. షాక్‌లో శ్రీవల్లి ఫ్యాన్స్..
గీత గోవిందం మూవీ నుంచి నేషనల్ క్రష్ రష్మిక మందన్న, విజయ్ దేవర కొండల మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అని ఇండస్ట్రీలో తరచుగా చర్చలు జరుగుతున్నాయి. దీనికి బలం చేకూర్చేలా ఎక్కడకు వెళ్లిన కూడా ఇద్దరు కలిసి వెళ్తుంటారు.
కొన్ని ఏళ్ల నుంచి విజయ్ దేవర కొండ, రష్మికలు డేటింగ్ లో ఉన్నారని, వీరు తొందరలోనే ఒక ఇంటి వారౌతారని కూడా ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో రష్మిక ఇటీవల దీపావళి వేడుకల్ని కూడా.. విజయ్ దేవ కొండ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే.
అదే విధంగా వీరిద్దరు కలిసి ఇటీవల పలు టూర్లకు వెళ్లిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. తాజాగా, పుష్ప2 మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా రష్మిక మందన్న.. విజయ్ దేవర కొండ ఫ్యామిలీతో కలిసి సినిమాను ఫుల్ ఎంజాయ్ చేసింది.ఈ క్రమంలో ప్రస్తుతం వీరి ప్రేమ, పెళ్లికి సంబంధించిన వార్తలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి.
అయితే.. తాజాగా... రష్మికతో పెళ్లి రూమర్స్ పై రౌడీ స్టార్ విజయ్ దేవర కొండ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్పందించినట్లు తెలుస్తొంది. సాధారణంగా సెలబ్రీటీల గురించి తెలుసుకొవాలనే క్యూరీయాసిటీ ఫ్యాన్స్ లో ఉంటుందని అన్నారు. ఒక వేళ తన జీవితంలో అలాంటి గుడ్ న్యూస్ ఉంటే తప్పకుండా చెప్తానన్నారు.
న్యూఇయర్ వచ్చిందంటే చాలు తనకు పెళ్లి చేస్తున్నారని.. కొన్ని సార్లు విజయ్ దేవర కొండ అసహానం వ్యక్తం చేసిన విషయం కూడా తెలిసిందే. అదే విధంగా విజయ్ మాట్లాడుతూ.. ప్రేమ ఉందో లేదో తెలీదు కానీ.. ప్రేమతో పాటు బాధ కూడా ఉటుందన్నారు. ఎంత ప్రేమిస్తే.. అంత బాధను మోయాల్సి ఉంటుందని విజయ్ అన్నారు.
మరొవైపు విజయ్ దేవర కొండ ఫ్యామీలీ స్టార్ అనుకున్నంత సక్సెస్ కాలేదని తెలుస్తొంది. ఆ తర్వాత కల్కీ మూవీలో అర్జునుడిలా అతిథి పాత్రను పోషించారు. ప్రస్తుతం విజయ్ దేవర కొండ వీడీ12 సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తొంది. ఇదిలా ఉండగా.. కొంత మంది సోషల్ మీడియాలో విజయ్ దేవర కొండ చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరిస్తు.. రష్మికను, విజయ్ దేవర కొండ భరించేందుకు సిద్దంగా లేడని కొంత మంది పనిగట్టుకుని ఇలా తప్పుగా ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తొంది.