Virat Kohli Blessed With A Baby Girl: తండ్రయిన విరాట్ కోహ్లీ.. పాపకు జన్మనిచ్చిన అనుష్క శర్మ

Mon, 11 Jan 2021-6:52 pm,

భారత్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్ కోహ్లీ తండ్రి అయ్యాడు. కోహ్లీ భార్య, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ ఓ పండంటి పాపకు సోమవారం నాడు జన్మనిచ్చారు. ఈ సంతోషాన్ని కోహ్లీ(Virat Kohli) ట్విటర్‌ ద్వారా వెల్లడించాడు. (Virat Kohli Twitter Photo)

మా(అనుష్క శర్మ, నా) జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందంటూ ఓ ట్వీట్ చేశాడు కోహ్లీ. ‘ఈ రోజు మధ్యాహ్నం మాకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు మాపై చూపిన ప్రేమ, ప్రార్థనలు, శుభాకాంక్షలకుగానూ ధన్యవాదాలు. ప్రస్తుతం పాప, అనుష్క ఆరోగ్యంగా ఉన్నారని’ తన పోస్టులో విరాట్ కోహ్లీ వెల్లడించాడు. (Virat Kohli Twitter Photo)

Gallery: Actress Aathmika Photos: అందాల నటి ఆత్మిక లేటెస్ట్ ఫొటోస్

నిండు గర్భిణిగా ఉన్న సమయంలో అనుష్క శర్మ (Anushka Sharma)  మాత్రం కఠినమైన ఆసనాలను వేశారు. అనుష్క శీర్షాసనం (Anushka Sharma Shirshasanam) వేసిన సమయంలో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. అనుష్క శర్మ భర్త, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆమెకు ఆసనం వేయడంలో సహాయం చేయడం తెలిసిందే. (Anushka Sharma Instagram)

2021 జనవరిలో మేం తల్లిదండ్రులం కాబోతున్నామని గత ఏడాది ఆగస్టు నెలలో కోహ్లీ, అనుష్క శర్మ వెల్లడించారు. తాము ముగ్గురం కాబోతున్నామని, ఓ బేబీ రానుందని నటి అనుష్క శర్మ (Anushka Sharma's Pregnancy) సైతం తాను గర్భం దాల్చిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా అప్పట్లో తెలిపారు. (Virat Kohli Twitter Photo)

2017 డిసెంబర్ 11న ఇటలీలో కోహ్లీ, అనుష్కల వివాహం జరిగింది. కేవలం ఇరు కుటుంబసభ్యులు, కొందరు సన్నిహితుల సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. తాము తల్లిదండ్రులం కాబోతున్నామన్న శుభవార్తను ఎట్టకేలకు పంచుకున్నారు. (Virat Kohli Twitter Photo)

Also Read: టాప్ హీరోయిన్లు బ్యాక్‌లెస్ డ్రెస్సులో సన్నింగ్ లుక్స్

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link