భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తండ్రి అయ్యాడు. కోహ్లీ భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఓ పండంటి పాపకు సోమవారం నాడు జన్మనిచ్చారు. ఈ సంతోషాన్ని కోహ్లీ ట్విటర్ ద్వారా వెల్లడించాడు.
MS Dhoni ICC Spirit of Cricket Award of the Decade: మహేంద్ర సింగ్ ధోనీకి ఐసీసీ ఈ దశాబ్దపు అత్యుత్తమ ఆటగాళ్ల ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. ‘ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డ్ ఆఫ్ ది డికేడ్’ అవార్డు ధోనీని వరించగా.. పరుగుల యంత్రం, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఐసీసీ అత్యుత్తమ ఆటగాడు అవార్డుతో పాటు వన్డే ప్లేయర్ ఆఫ్ ది డికేడ్ అవార్డు ప్రకటించారు.
Ajinkta Rahane Slams Century At MCG: రెండో టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ అజింక్య రహానే 195 బంతుల్లో శతకం సాధించాడు.
India vs Australia 2nd Test Live Updates Ajinkya Rahane: ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ మధ్యలోనే కెప్టెన్ విరాట్ కోహ్లీ సెలవు మీద భారత్‌కు తిరిగొచ్చేశాడు. దీంతో మిస్టర్ కూల్ అజింక్య రహానేకు సారథ్య బాధ్యతలు అప్పగించారు. కోహ్లీ గైర్హాజరిలో జట్టును విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు
IND vs AUS 1st Test Highlights : భారత క్రికెట్ టెస్టు చరిత్రలో దారుణమైన స్కోరు నమోదు చేసింది. అది కూడా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలోనే పడుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో 50కి పైగా పరుగుల ఆధిక్యం సాధించిన విరాట్ కోహ్లీ సేన రెండో ఇన్నింగ్స్‌లో ఎవరూ ఊహించని రీతిలో కేవలం 36 పరుగుల తేడాతో ఆలౌటైంది.
ఆస్ట్రేలియా జట్టుపై 2-1తో టీ20 సిరీస్ నెగ్గిన టీమిండియాకు జరిమానా విధించింది ఐసీసీ. ఆస్ట్రేలియాతో జరిగిన నామమాత్రమైన మూడో టీ20లో స్లో ఓవర్ రేటు నమోదు చేసిన కారణంగా (Team India fined for slow over rate) విరాట్ కోహ్లీ సేనకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) జరిమానా విధించింది.
India vs Australia 3rd T20I Highlights | భారత్‌తో జరిగిన మూడో టీ20లో ఆతిథ్య ఆస్ట్రేలియా విజయం సాధించింది. సిరీస్ ఇదివరకే భారత్ నెగ్గడంతో ఆధిక్యం 2-1కి తగ్గింది. టీమిండియా చివరివరకు పోరాడినా ప్రయోజనం దక్కలేదు. కోహ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడినా ఓటమి అంతరం తగ్గింది తప్ప లాభం లేకపోయింది.
సిడ్నీలో ఆస్ట్రేలియాతో మంగళవారం జరగతున్న మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే రెండో టీ20కి గాయం కారణంగా దూరమైన ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ మూడో మ్యాచ్‌కు మళ్లీ వచ్చాడు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. కాన్‌బెర్రా వేదికగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో 13వ ఓవర్ అబాట్ వేసిన తొలి బంతిని మిడాఫ్ దిశగా ఆడి సింగిల్ తీయడంతో వన్డేల్లో 12వేల పరుగులు (12000 runs in ODI cricket for Virat Kohli) పూర్తి చేసుకున్నాడు కోహ్లీ.
Benefits of Shirshasana | అనుష్క శర్మ ఇటీవలే శీర్షాసనం చేసిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలో ఆమెకు భర్త విరాట్ కోహ్లీ సపోర్ట కూడా ఇస్తాడు. అది చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. అంటే భర్త సపోర్ట్ ఇవ్వడం చూసి కాదు.. అనుష్క శీర్షాసనం చేయడం చూసి. గర్భవతిగా ఉన్నప్పుడు అలా చేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.
Anushka Sharma Headstand | నిండు గర్భిణి అయితేనేం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నట్లు నిరూపిస్తోంది బాలీవుడ్ నటి అనుష్క శర్మ. గర్భం దాల్చక ముందే ఏవైతే ఆసనాలు అనుష్క ప్రతిరోజూ వేసేదో ఇప్పుడూ అదే కొనసాగిస్తున్నా అంటోంది. ఎంతో మంది గర్భిణులకు ఆదర్శంగా నిలుస్తోంది.
సిడ్నీ వేదికగా మరో సమరం ప్రారంభమైంది. తొలి వన్డేలో పరాజయం పాలైన భారత్ ఈ రోజు ఆతిథ్య జట్టు ఆసీస్‌ను ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో మైదానంలోకి అడుగుపెట్టింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే మ్యాచ్ సిడ్నీ వేదికగా జరుగుతోంది.
నువ్వా నేనా సమరం మొదలైంది. బరిలో మిగిలేది ఎవరో తెల్చుకునే సమరం ప్రారంభమైంది. టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకుంది. మూడేళ్ల తరువాత నాకౌట్ కు చేరుకున్న బెంగుళూరు విజేతగా నిలుస్తుందా లేదా మరి..
Virat Kohli Birthday Celebration | కెప్టెన్ విరాట్ కోహ్లీ నేడు 32వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో బిజీగా ఉన్న విరాట్ కోహ్లీ దుబాయ్‌లో తన పుట్టినరోజు వేడుకలు (Virat Kohli birthday Celebration) జరుపుకున్నాడు. విరాట్ కోహ్లీ పుట్టినరోజు వేడుకల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
RCB In IPL 2020 Playoff | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2020 టైటిల్ గెలవడం కష్టమేనని మాజీ కెప్టెన్ అభిప్రాయపడ్డాడు. ఇప్పటివరకూ ఊరిస్తున్న ఐపీఎల్ టైటిల్‌ను ఈసారైనా దక్కించుకోవాలని విరాట్ కోహ్లీ సేన ఆశగా ఎదురుచూస్తోంది. అయితే ఆర్సీబీకి అంత ఈజీ కాదని మాజీ క్రికెటర్ అంటున్నాడు.
టీమ్ ఇండియా ( Team India ) కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మధ్య తన సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటున్నాడు. తన భార్య అనుష్కతో దిగిన ఫోటోలను షేర్ చేయడంతో పాటు క్రికెట్ మూమెంట్స్ కూడా తరచూ పోస్ట్ చేస్తూ అభిమానులను ఎంగేజ్ చేస్తున్నాడు కోహ్లీ.
ఐపీఎల్ సీజన్ 13లో అన్నీ అద్భుతాలే జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ సంచలనం రేపాడు. పర్ఫెక్స్ బంతులతో ప్రత్యర్ది టీమ్ ను కకావికలం చేసేశాడు.
ఐపీఎల్ 2020 (IPL 2020) లో ఈ రోజు సాయంత్రం కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో కోల్‌కతా జట్టులోకి న్యూజిలాండ్ వికెట్ కీపర్, యువ హిట్టర్ చేరనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
డి విలియర్స్ బ్యాటింగ్ ను అందుకే విధ్వంసకరంగా పిలుస్తారు. సిక్సర్ల మోతతో చెలరేగి ఆడి ఓడాల్సిన మ్యాచ్ ను గెలిపించాడు. రాజస్థాన్ రాయల్స్ పై బెంగుళూరు జట్టుకు విజయాన్ని అందించాడు.