Visa Card Vs Mastercard: బాబోయ్.. వీసా, మాస్టర్ కార్డుల మధ్య ఇన్ని తేడాలా..
ప్రస్తుతం చాలామంది కూరగాయలను కొనేందుకు కూడా డెబిట్, క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారు అంటే వీటి వినియోగం ఎంత పెరిగిందో పెద్దగా చెప్పనక్కర్లేదు. అయితే డెబిట్ కార్డుల మీద రూపే, మాస్టర్, visa అనే ప్రింటింగ్ రాసి ఉండడం మనం తరచుగా చూస్తూ ఉంటాం. నిజానికి ఇవి కార్డు నెట్వర్క్ లో భాగంగానే ప్రింటింగ్ చేస్తారు.
ఒక్కొక్క కార్డుకు ఒక్కొక్క నెట్వర్క్ ఉంటుంది. కొన్ని కార్డుల పైన రూపే అని ఉంటే.. మరికొన్ని కార్డుల పైన వీసా, మాస్టర్ కార్డ్ అని ఉంటాయి. నిజానికి ఈ పేర్లనేవి కేవలం నెట్వర్క్ లకు సంబంధించిన బ్రాండింగ్ మాత్రమే.. అయితే వీటిల్లో రూపే అని ఉండే నెట్వర్క్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను కేవలం భారతదేశం లోనే వినియోగించవచ్చు.
అలాగే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులపై వీసా, మాస్టర్ కార్డ్ లను ఇతర దేశాల్లో కూడా నగదు బదిలీకి వినియోగించవచ్చు. అంతేకాకుండా ఈ కార్డులలో ఉండే సౌకర్యాలు కూడా కొంత ప్రీమియంగా ఉంటాయి. ఈ మూడు కార్డుల మధ్య అనేక తేడాలు కూడా ఉన్నాయి.
ముఖ్యంగా వీసా, మాస్టర్ కార్డులను చాలామంది రెగ్యులర్గా వినియోగిస్తూ ఉంటారు. నిజానికి వీటి రెండిటి మధ్య ఉన్న తేడాలు ఎవ్వరికీ సరిగ్గా తెలియదు. అయితే ఈ రెండు కార్డుల మధ్య ఉన్న తేడాలేంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
వీసా.. మాస్టర్ కార్డులు వినియోగించేవారు అధిక మోతాదులో ఆపరేషన్ బిల్ చెల్లించాల్సి ఉంటుంది. ఇవి రూపే కార్డుతో పోలిస్తే చాలా ఎక్కువ అని తెలుస్తోంది. అదే రూపే కార్డు వినియోగించేవారు తక్కువ మోతాదులోనే ప్రాసెసింగ్ బిల్ ని చెల్లిస్తారు.
ఇక వీసా మాస్టర్ కార్డులు ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా నగదును బదిలీ చేసుకోవచ్చు. అంతేకాకుండా వాటితో బిల్ పేమెంట్స్ కూడా చేయవచ్చు. ఇక రూపే కార్డు అయితే కేవలం భారతదేశంలో మాత్రమే వినియోగించుకునే ఫెసిలిటీని కలిగి ఉంటుంది.
వీసా మాస్టర్ కార్డులు ఉన్నవారు బ్యాంకులకు ప్రతి త్రైమాసికంలో తప్పకుండా చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే మైనస్ల్లోకి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక రూపే కార్డు ఉన్నవారు ఎలాంటి చార్జీలు చెల్లించిన అక్కర్లేదు. ఒకవేళ చెల్లించిన కేవలం సంవత్సరానికి ఒకసారి మాత్రమే తక్కువ మోతాదులో చెల్లించాల్సి ఉంటుంది.
రూపే కార్డు అనేది భారతదేశ నెట్వర్క్.. కాబట్టి అన్ని బ్యాంకులు ఈ నెట్వర్క్ ను వినియోగిస్తూ ఉంటాయి. దీనివల్ల ఎలాంటి చార్జీలు ఉండవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక మాస్టర్ కార్డ్, వీసాలు అయితే ఇవి ఇంటర్నేషనల్ నెట్వర్క్ లు కాబట్టి తప్పకుండా బిల్ చెల్లించాల్సి ఉంటుంది.