Vitamin K Rich Foods: విటమిన్ కే లోపం ప్రమాదకరం, ఈ 5 ఫుడ్స్ తింటే చాలు
బ్రోకలీ
బ్రోకలీలో విటమిన్ కేతో పాటు ఇంకా చాలా ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఆకు కూరల్లో ఇది చాలా బెస్ట్ అని చెప్పవచ్చు. ఇందులో ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఒక కప్పు వండిన బ్రోకలీలో రోజుకు కావల్సిన విటమిన్ కే 90 శాతం లభిస్తుంది.
లెట్యూస్ అండ్ కోలార్డ్ గ్రీన్స్
ఇదొక రకం అద్భుతమైన ఆకు కూర. విటమిన్ కే పెద్దమొత్తంలో ఉంటుంది. ఇందులో ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఎముకల్ని పటిష్టంగా ఉంచేందుకు దోహదం చేస్తుంది
కేల్
దీనినొక సూపర్ ఫుడ్‌గా అభివర్ణిస్తారు. ఇందులో విటమిన్ కే ఫుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల్ని స్ట్రాంగ్ చేస్తుంది. శరీరంలో బ్లోటింగ్ ప్రక్రియను బ్యాలెన్స్ చేస్తుంది
సోయా బీన్స్ ఆయిల్
సోయా బీన్స్ ఆయిల్‌లో విటమిన్ కే పెద్దమొత్తంలో ఉంటుంది. ఎముకలు, గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. రోజూ సోయా బీన్స్ ఆయిల్‌తో చేసే వంటలు తినడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా అందుతాయి.
పాలకూర
పాలకూరలో విటమిన్ కే, ఐరన్ రెండూ పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా బ్లడ్ క్లాటింగ్, ఎముకల పటిష్టతకు ఉపయోగమౌతుంది. ఒక కప్పు పాలకూరలో రోజుకు కావల్సిన విటమిన్ కే కంటే 5-6 రెట్లు ఎక్కువే లభిస్తుంది. అందుకే వారంలో ఒక్కరోజైనా పాలకూర తింటే చాలు