Walking Benefits: రోజూ 40 నిమిషాలు వాకింగ్ చాలు అన్ని వ్యాధులకు చెక్
గుండె ఆరోగ్యం
రోజూ వాకింగ్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది బెస్ట్ కార్డియో వాస్క్యులర్ వ్యాయామం. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. రోజూ 40 నిమిషాలు నడిస్తే రక్త సరఫరా పెరుగుతుంది. కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసేందుకు, హార్ట్ స్ట్రోక్ వంటి సమస్యల ముప్పు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.
మానసిక ఆరోగ్యం
రోజూ క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం వల్ల మెదడుకు చాలా మంచిది. మానసిక ఆరోగ్యం కలుగుతుంది. ఒత్తిడి, ఆందోళన దూరమౌతాయి. రోజూ 40 నిమిషాలు వాకింగ్ చేయడం వల్ల డిప్రెషన్ వంటి లక్షణాలు కూడా దూరమౌతాయి
బరువు నియంత్రణ
బరువు తగ్గించే ఆలోచన ఉంటే రోజూ వాకింగ్ చేయడం చాలా మంచిది. కేలరీలు చాలా వేగంగా బర్న్ అవుతాయి. రోజూ 40 నిమిషాలు వాకింగ్ చేస్తే శరీరం మెటబోలిజం వేగవంతమౌతుంది. కొవ్వు వేగంగా కరుగుతుంది.
ఇమ్యూనిటీ
రోజూ వాకింగ్ చేయడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. శరీరంలో యాంటీ బాడీస్ పెరుగుతాయి. వైట్ బ్లడ్ సెల్స్ పెంచేందుకు దోహదం చేస్తుంది. వివిధ రకాల వ్యాధుల ముప్పు తగ్గుతుంది.
ఎముకలకు బలం
రోజూ వాకింగ్ చేయడం వల్ల ఎముకలు, జాయింట్స్ పెయిన్ రిలీఫ్ చేసేందుకు ఉపయోగపడుతుంది. ఆస్టియోపోరోసిస్ వంటి రోగాల ముప్పు తగ్గిస్తుంది. ప్రత్యేకించి వృద్ధులకు చాలా మంచిది.