Soaked Walnuts: వర్షాకాలం వ్యాధులతో జాగ్రత్త, రోజు గుప్పెడు వాల్‌నట్స్ తింటే అన్నింటికీ చెక్
బరువు నియంత్రణకు
వాల్‌నట్స్‌లో ఫైబర్ మోతాదు అధికంగా ఉంటుంది. దాంతో ఎక్కువసేపు ఆకలేయదు. బరువు తగ్గేందుకు దోహదమౌతుంది.
చర్మ, కేశాల సంరక్షణ
వాల్‌నట్స్‌లో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల చర్మ, కేశాల సంరక్షణకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. వర్షాకాలంలో చర్మ,, కేశ సంబంధిత సమస్యలు అధికంగా ఉంటాయి.
ఎముకలు బలోపేతం
వాల్‌నట్స్‌లో కాల్షియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎముకల బలోపేతానికి కారణమౌతాయి. ఎముకల్లో నొప్పి, కీళ్ల నొప్పులు దూరమౌతాయి. వాల్‌నట్స్ సేవిస్తే అన్ని సమస్యలు దూరమౌతాయి
మెదడు వికాసం
వాల్‌నట్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడును ఉత్తేజితం చేస్తాయి. వర్షాకాలంలో ఎక్కవగా అలసట, బద్ధకం ఉంటుంది. వాల్‌నట్స్ తినడం వల్ల వీటి నుంచి ఉపశమనం పొందవచ్చు.
జీర్ణక్రియ మెరుగుదల
వాల్‌నట్స్‌లో ఫైబర్ పెద్దమొత్తంలో ఉంటుంది. దాంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వర్షాకాలంలో ఎదురయ్యే ప్రధాన సమస్యల్లో జీర్ణ సమస్య ఒకటి.
ఇమ్యూనిటీ బూస్ట్
వాల్‌నట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీ బూస్ట్ చేసేందుకు దోహదం చేస్తాయి. వర్షాకాలంలో వ్యాపించే సీజనల్ వ్యాధుల్నించి రక్షణ కల్పిస్తాయి.