Rise in Prices: టీవీ, ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల ధరలు షాక్.. త్వరలో భారీగా పెంపు

Wed, 09 Dec 2020-8:55 am,

టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, ఎయిర్ కండీషనర్, మైక్రోవేవ్, తదితర ఉత్పత్తులపై ఆయా కంపెనీలు బ్రాండ్స్ ధరలను భారీగా పెంచనున్నాయని (Rise in Prices) ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. రాగి, జింగ్, ప్లాస్టిక్, స్టీల్, అల్యూమినియం ముడి సరుకులలపై ధరలు పెరిగిన కారణంగా ఈ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 20శాతం ధరలు పెరగే అవకావం ఉంది.

ఆ రిపోర్ట్ ప్రకారం... ప్రపంచ వ్యాప్తంగా టీవీ ప్యానెల్స్‌కు కొరత ఏర్పడింది. దీంతో టీవీలపై భారత్‌లో ధరలు పెరగనున్నాయి. దాదాపు 30శాతానికి పైగా ధరలు పెరిగే అవకాశాలున్నాయని అంచనా.

గోద్రెజ్ అప్లియాన్సెస్ బిజినెస్ అధినేత కమల్ నంది మాట్లాడుతూ.. రిఫ్రిజిరేటర్ (Refrigerator Price Rise) సహా ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు తక్కువ సమయంలోనే పెరిగే అవకాశం ఉందన్నారు. వినియోగదారులపై మరింత భారం మోపేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని, ఈ నెలాఖరుకల్లా ధరలు పెరగవచ్చునని అభిప్రాయపడ్డారు.

ముడి సరుకు ధర పెరగడంతో ఉత్పత్తి వ్యయం పెరిగిపోతుంది. దీంతో ఎయిర్ కూలర్ల ధరలు సైతం పెంచాలని కంపెనీలు భావిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. సాధ్యమైనంత త్వరగా ఇలాంటి వస్తులు కొనుగోలు చేయడం ఉత్తమం.

ఫెస్టివల్ సీజన్ కావడంతో వాషింగ్ మెషీన్‌ల ధరల పెంపును సెప్టెంబర్ నెలలలోనే వాయిదా వేశారు. కానీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వీటిలోనూ భారీగా ధరల పెరుగుదల కనిపిస్తుందని సమాచారం. కొందరు ఇప్పుడే వాషింగ్ మెషీన్‌లు కొనుగోలు చేస్తున్నారు.

సాధారణంగా వేసవి సీజన్ వచ్చిందంటే ఫ్రిజ్‌ల ధరలు పెరుగుతాయి. కానీ ప్రస్తుతం కరోనా వైరస్, లాక్‌డౌన్ ప్రభావం ముడి సరుకుపై పడింది. దీంతో రిఫ్రిజిరేటర్, ఫ్రిజ్‌ల ధరలు 12 నుంచి 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు.

Read Also: EPFO: మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలియదా.. అయితే UAN యాక్టివేట్ చేసుకోండి   

ఎయిర్ కండీషనర్ ధరలతో పాటు వాషింగ్ మెషీన్ల ధరలు 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. దీంతో కొందరు వినియోగదారులు మరింత భారం తమపై పడకముందే ఇప్పుడే వీటిని ఖరీదు చేస్తున్నారు.

Also Read: Second Hand Bike on Lowest Price: తక్కువ ధరలకు సెకండ్ హ్యాండ్ బైక్స్.. ఎన్నో ప్రయోజనాలు  

టీవీ ధరలు కనిష్టంగా 7 శాతం, గరిష్టంగా 20 వరకు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అయితే చాలా ఏళ్ల తర్వాత అత్యధికంగా ధరలు ప్రస్తుతం పెరగనున్నాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read : SBI Credit Card Offers: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌తో రూ.25000 గెలుచుకోండి.. ఏం చేయాలంటే!

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link