Wheat Dosa: బరువుని అదుపులో పెట్టే గోధుమ పిండి దోశ తయారీ విధానం..!
బరువుని అదుపులో పెట్టే గోధుమ పిండి దోస తయారీ విధానం కోసం..ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి.
అందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండిని కూడా వేసుకొని..బాగా కలుపుకోవాలి.
ఆ తర్వాత అందులో ఒక పెద్ద ఉల్లిపాయను..సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి.
ఒక రెండు పచ్చిమిరపకాయలను కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి.
అందులోనే రుచికి సరిపడా ఉప్పు, సోడా ఉప్పు వేసుకుని తగిన నీళ్లతో.. దోశ పిండి లాగా తయారు చేసుకోవాలి.
స్టవ్ మీద పెనం పెట్టి.. అది వేడయ్యాక ఈ గోధుమపిండి మిశ్రమాన్ని దోసెల్లాగా పోసుకోవాలి.
రెండు వైపులా.. గోధుమ రంగు వచ్చేవరకు కాల్చుకుంటే గోధుమపిండి దోశ రెడీ.