Weight Loss Diet: ఎలాంటి కష్టం లేకుండా కేవలం 9 రోజుల్లో కేజీ బరువు తగ్గడం ఖాయం!

Sun, 07 May 2023-12:59 pm,

ప్రతి రోజు వాకింగ్‌ చేయడం వల్ల కూడా శరీర ఫిట్‌గా మారి.. బరువు తగ్గుతారు. కాబట్టి అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా ప్రతి రోజు 10 నుంచి 20 నిమిషాల పాటు వాకింగ్‌ చేయాల్సి ఉంటుంది..  

సలాడ్స్‌ కూడా శరీర బరువును నియంత్రిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మొలకెత్తిన పప్పులను తీసుకుని సలాడ్స్‌లా చేసుకుని డైట్‌లో తీసుకోవడం వల్ల సులభంగా శరీర బరువు తగ్గుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. 

ఇడ్లీ సాంబార్ కూడా శరీర బరువును నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి అల్పాహారంలో ప్రతి రోజు ఇడ్లీ సాంబార్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఫైబర్‌ కూడా అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి శరీరం దృఢంగా తయారవుతుంది. 

ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే పప్పులను కూడా ఆహారాల్లో తీసుకోవాల్సి ఉంటుంది. అన్ని రకాల పప్పులను తీసుకుని ఒక రోజు ముందే నీటిలో నానబెట్టుకుని అట్టు, దోసెలా వేసుకుని తినడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా తగ్గుతాయి.

లీచీ పండ్లలో ఫైబర్‌ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి ఈ పండ్లతో తయారు చేసిన రసాన్ని ప్రతి రోజు ఖాళీ కడుపుతో తాగడం వల్ల సులభంగా శరీర బరువు నియంత్రించవచ్చు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. 

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link