Weight Loss Remedies: రోజూ కీరా తింటే 21 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం
హైడ్రేషన్
దాహం తీర్చేందుకు కీరా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ. అందుకే శరీరం ఎక్కువ సమయం హైడ్రేట్‌గా ఉండేందుకు దోహదం చేస్తుంది.
మలబద్ధకం నుంచి ఉపశమనం
కీరాలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫలితంగా ఇది మల విసర్జనలో దోహదం చేస్తుంది. మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. ప్రతిసారీ భోజనం తరువాత కీరా తినడం అలవాటు చేసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
బరువు తగ్గించడం
ఇందులో కేలరీలు తక్కువగా ఉండి పోషక విలువలు అధికంగా ఉంటాయి. అందుకే కీరా తిన్నప్పుడు కడుపు నిండుగా ఉంటుంది. చాలాసేపు ఆకలేయదు. బరువు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది
బరువు తగ్గే ప్రక్రియలో కీరా
కీరాలో యాంటీ డయాబెటిక్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పూర్తిగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ కే, ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే కీరా ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే కాకుండా బరువు నియంత్రణలో కూడా ఉపయోగపడుతుంది.
కంటి చూపు
కీరాలో ఉండే విటమిన్ ఎ కంటి చూపు మెరుగుపర్చేందుకు దోహదం చేస్తుంది. కంటి సమస్యలు ఉత్పన్నం కావు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను నియంత్రిస్తాయి.
బ్లడ్ షుగర్ నియంత్రణ
కీరాలో షుగర్ ఉండదు. కానీ హైడ్రేట్ చేస్తుంది. కీరా తరచూ తినడం వల్ల స్వీట్ క్రేవింగ్ తగ్గుతుంది. దాంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ నియంత్రించవచ్చు.