Brides Market: ఇచ్చట పెళ్లికూతుర్లు అమ్మబడును, డిమాండ్ ఉంటే వేలం
మార్కెట్‌లో అమ్మాయి నచ్చిన తరువాత సదరు అబ్బాయి ఆ అమ్మాయిని భార్యగా భావించుకుంటాడు. ఆ తరువాత ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోవల్సి వస్తుంది. ఆ ఇద్దరి మధ్య ఇరువురి కుటుంబ ఆదాయం, ఆస్థుల గురించి చర్చ ఉంటుంది. ఆ తరువాత పెళ్లి ధర నిర్ణయించుకుని ఖరారు చేసుకుంటారు.
అమ్మాయిల సంతకు వెళ్లేందుకు చాలా రోజుల ముందు నుంచే అమ్మాయిలు ఏర్పాట్లు చేసుకుంటారు. ఎక్కువ డబ్బులు రావాలంటే ఎక్కువ అందంగా కన్పించాల్సి వస్తుంది. అందుకే మంచి మంచి దుస్తులు, మేకప్‌తో మార్కెట్‌కు వస్తుంటారు.
ఈ కమ్యూనిటీ ప్రజలు తమ అమ్మాయిల్ని ఎక్కువగా చదివించరని సమాచారం. సంతకు వచ్చే అమ్మాయిలకు ప్రధానంగా వంట వచ్చి ఉండాలి. తక్కువ వయస్సైనా ఫరవాలేదు. అబ్బాయికి అమ్మాయి నచ్చిన తరువాత బేరం ఎంతనేది నిర్ధారితమవుతుంది. ఒక్కొక్క అమ్మాయికి 3 వందల్నించి 4 వందల డాలర్లు చెల్లిస్తుంటారని అంచనా.
పెళ్లికూతుర్ల మార్కెట్ కళాయిజ్దీ సముదాయం తరపున ఏర్పాటవుతుంది. పెళ్లికూతురిని కొనుగోలు చేసేందుకు వచ్చేవారు కూడా ఈ సామాజికవర్గానికి చెందినవారే అయుంటారు. ఇక్కడికి బయటి సామాజిక వర్గపు వ్యక్తి రాకూడదు. ఈ కమ్యూనిటీలో దాదాపు 18 వేలమంది ఉన్నారు. ఈ సాంప్రదాయంతో అక్కడి అమ్మాయిలకు కూడా ఎటువంటి సమస్య ఎప్పుడూ తలెత్తలేదట. ఎందుకంటే ముందు నుంచే ఇక్కడి అమ్మాయిల్ని మానసికంగా అందుకు సిద్ధం చేస్తారు.
బల్గేరియాలోని స్తారా జాగోర్ ప్రాంతంలో జరిగే పెళ్లికూతుర్ల మార్కెట్ లేదా సంత ఇది. ఇక్కడికొచ్చే పెళ్లికొడుకులు తమకు నచ్చిన పెళ్లికూతుర్లను కొనుగోలు చేసి పెళ్లి చేసుకోవచ్చు. ఈ మార్కెట్‌కు వచ్చేవారిలో ఎక్కువమంది అమ్మాయిలు మైనర్లే అయుంటారని ఓ నివేదిక చెబుతోంది. వీరి వయస్సు సాధారణంగా 13 నుంచి 17 ఏళ్ల మద్యలో ఉంటుంది.
పెళ్లికూతుర్ల మార్కెట్‌లోకి తమ అమ్మాయిల్ని తల్లిదండ్రులే స్వయంగా తీసుకొస్తారు. ఈ మార్కెట్‌లో పెళ్లికూతుర్లను కొనుగోలు చేసే పెళ్లికొడుకులు, బంధవులుంటారు. ఎవరెక్కువ వేలం పాడితే వారితో తమ అమ్మాయిల వివాహం ఖరారు చేస్తారు ఆ తల్లిదండ్రులు.