Loan Interest Rates: బ్యాంక్ లోన్ తీసుకునే ప్లాన్లో ఉన్నారా? SBI, HDFC, ICICI, కెనరా బ్యాంక్ సహా దేంట్లో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే?
November Lending Rates: ఆర్బీఐ త్వరలో రెపో రేట్లను తగ్గిస్తుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఆల్ టైమ్ గరిష్టాల వద్ద ఉన్నవడ్దీ రేట్లను క్రమంగా తగ్గిస్తోంది. ఇప్పుడు ఆర్బిఐ కూడా ఇదే బాటలో వడ్డీరేట్లు తగ్గించనున్నట్లు భావిస్తున్నారు. ఆర్బిఐ రెపో రేట్లు తగ్గిస్తే..అప్పుడు లోన్లపైనా వడ్డీ రేట్లను బ్యాంకులు తగ్గించాలి. ఈ క్రమంలో ముందుజాగ్రత్తగానే అప్రమత్తమైనా బ్యాంకులు లోన్ వడ్డీ రేట్లను సడెన్ గా పెంచుతున్నాయి. నవంబర్ లో చాలా బ్యాంకులు మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను పెంచాయి. ఎంసీఎల్ఆర్ పెరిగితే లోన్స్ పైనా బ్యాంకులు ఎక్కువ వడ్డీ వసూలు చేస్తాయని చెప్పవచ్చు.
ఎంసీఎల్ఆర్ అంటే రుణ ఆధారిత వడ్డీరేటు. దీనికంటే బ్యాంకులు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వకూడదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేస్తోంది. దాదాపు ప్రతినెలలోనూ బ్యాంకులు దీనిని సవరిస్తాయి. పెంచడం లేదా తగ్గించడం లేదా స్థిరంగా ఉంచుతాయి. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీబీఐ బ్యాంకు, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాయి. ఇప్పుడు ఎందులో లోన్ వడ్డీరేట్లు ఎలా ఉన్నాయనేది చూద్దాం.
SBI తాజాగా ఎంసీఎల్ఆర్ రేటను 3 టెన్యూర్లపై 5 బేసిస్ పాయింట్స్ మేర పెంచింది. ఎక్కువగా కన్జూమర్ లోన్స్ లింక్ అయి ఉండే ఏడాది టెన్యూర్ ఎంసీఎల్ ఆర్ కూడా పెరిగింది. దీంట్లో ఇప్పుడు ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ కూడా పెరిగింది. దీంట్లో ఇప్పుడు ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ 8.20శాతంగా ఉండగా..ఏడాది ఎంసీఎల్ఆర్ 9శాతానికి చేరింది. 2ఏళ్లు, 3ఏళ్లు ఎంసీఎల్ఆర్ వరుసగా 9.05 శాతం, 9.10 శాతంగా ఉన్నాయి.
హెచ్డీఎఫ్ సీ బ్యాంకు కూడా ఈ మధ్యే ఎంసీఎల్ఆర్ ఓవర్ నైట్, ఒక నెల, మూడేండ్ల టెన్యూర్లపై పెరిగింది. ఇందులో ఇప్పుడు 9.15 శాతం నుంచి గరిష్టంగా 9.50శాతంగా ఎంసీఎల్ఆర్ రేట్లు ఉన్నాయి. ఇక్కడ ఏడాది టెన్యూర్ ఎంసీఎల్ఆర్ 9.45శాతంగా కొనసాగుతోంది.
ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా MCLR పెంచింది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ 8.55శాతానికి పెరిగింది. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.80శాతానికి చేరింది. ఏడాది ఎంసీఎల్ఆర్ 9శాతానికి చేరింది.
కెనరా బ్యాంకులో లోన్ వడ్డీ రేట్లు 8.30శాతం నుంచి 9.40శాతం ఉన్నాయి. ఏడాది ఎంసీఎల్ఆర్ ఇక్కడ 9.05శాతంగా ఉంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ సాధారణ పౌరులకు 3.50శాతం నుండి 7.25శాతం సీనియర్ సిటిజన్లకు, 4శాతం నుండి 7.75శాతంతోపాటు అత్యధిక వడ్డీ రేట్లు 7.25శాతం 7.75శాతం 4వందల రోజుల కాలవ్యవధికి అందిస్తోంది.