Atal Tunnel Rohtang: అటల్ టన్నెల్ ప్రత్యేకతలేంటి ? దాని విశేషాలు ఇవే!
ఈ ప్రాజెక్టును 10,000 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు.
ఈ ప్రాంతంలో రవాణా సమస్యను ఈ టన్నెల్ తొలగించనుంది.
హిమపాతం సమయంలో ఈ ప్రాంతంలో ఆరునెలల పాటు దారులన్నీ మూతబడేవి. దీంతో ప్రయాణానికి అవకాశం లభించేది కాదు.
ఈ టన్నెల్ నిర్మాణంతో సుమారు 46 కిలోమీటర్లు తిరిగే శ్రమ ప్రజలకు తగ్గుతుంది.
ప్రతీ 500 మీటర్లకు ఒక ఎమర్జెన్సీ ద్వారాన్ని నిర్మించారు. ఇలాంటివి సుమారు 18 మార్గాలు ఉన్నాయి.
సీసీటీవి కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ప్రతీ 150 మీటర్లకు ఎమర్జెన్సీ కాంటాక్ట్ కమ్యునికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
హిమాలయాల్లోని పీర్ పంజాల్ రేంజ్ లో 3000 మీటర్ల ఎత్తులో ( సముద్ర మట్టానికి ) దీన్ని నిర్మించారు.