Vitamin B6 Rich Foods: విటమిన్ బి6 లోపాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, ఈ 5 ఫుడ్స్ తీసుకోండి
చికెన్ లివర్
చికెన్ లివర్‌లో ప్రోటీన్లు, విటమిన్ ఎ, విటమిన్ బి12తో పాటు విటమిన్ బి6 కావల్సినంత ఉంటుంది.
సాల్మన్ చేప
సాల్మన్ చేపలో పైరిడాక్సిన్ పెద్దమొత్తంలో ఉంటుంది. విటమిన్ బి6 అనేది అడ్రినల్ ఆరోగ్యం కోసం ఉపయోగపడుతుంది. హార్మోన్ బ్యాలెన్స్ చేస్తుంది.
గుడ్లు
పాలతో పాటు గుడ్లు కూడా సూపర్ ఫుడ్ కోవలోకి వస్తాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లేదా లంచ్ లేదా డిన్నర్‌లో గుడ్డు తీసుకుంటే విటమిన్ బి6 కొరత తలెత్తదు. రోజుకు రెండు గుడ్లు తింటే రోజువారీ పరిమాణంలో 10 శాతం లభిస్తుంది.
పాలు
పాలను సాధారణంగా సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. ఇందులో దాదాపుగా అన్నిరకాల పోషకాలు ఉంటాయి. ఇందులో పైరిడడాక్సిన్ సమృద్ధిగా ఉంటుంది. అందుకే రోజూ ఒక గ్లాసు పాలు తాగితే విటమిన్ బి6 లేదా పైరిడాక్సిన్ కావల్సినంతగా లభిస్తుంది.
క్యారట్
క్యారట్‌లో విటమిన్ ఎతో పాటు విటమిన్ బి6 సమృద్దిగా ఉంటుంది. రోజూ క్యారట్ తగిన పరిమాణంలో తీసుకుంటే విటమిన్ బి6 ఉంటుంది.