Alcohol: రోజు మద్యం తాగితే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా..?
రోజు మద్యం సేవించడం వల్ల మన శరీరంలో ఎన్నో మార్పులు రావడమే కాకుండా.. మన గుండె పనితీరు కూడా క్షీణిస్తూ వస్తుంది.
ముఖ్యంగా ఎక్కువగా మద్యం తాగడం వల్ల ..నరాల బలహీనత చాలా త్వరగా వస్తుంది.
తద్వారా చేతుల్లో నొప్పులు, కాళ్ళూ మంటలూ వస్తాయి.
ఎన్ని మందులు వాడినా ఈ సమస్యలు తగ్గడం చాలా కష్టమే.
అంతే కాదు రోజు మద్యం సేవించే వారికి చాలా త్వరగా మెదడులో కణాలు దెబ్బతింటాయి. అందువలన జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది.
అందువల్లే వీలైనంతవరకు తాగడం వదిలేయడం ఉత్తమమైన పని.
అయితే వెంటనే తాగుడు మానేసిన..కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకే కొంచెంగా తగ్గిస్తూ వస్తు మానేయడం ఉత్తమం.