Secured Credit Card: మీతో సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ ఉందా? ఇవి ఎవరికి ఇస్తారో తెలుసా!

Mon, 28 Dec 2020-4:03 pm,

ఈరోజుల్లో బ్యాంకు ఖాతాదారులలో చాలా వరకు క్రెడిట్ కార్డ్ వినియోగిస్తున్నారు. తమకు కావాల్సిన వస్తువులు, సర్వీసుల బిల్లు చెల్లింపుల కోసం క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటున్నారు. అయితే క్రెడిట్ కార్డ్ సైతం దానికంటూ ప్రత్యేక కస్టమర్లను కలిగి ఉంది. ముఖ్యంగా చేతిలో నగదు లేని సందర్భాలలో క్రెడిట్ కార్డ్స్ తమ ఖాతాదారులకు ప్రయోజనాలు చేకూరుస్తాయి. 

Also Read: Infinix Smart HD 2021 Price In India: బడ్జెట్ ధరకే 5000mAH స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్లు ఇవే

అయితే ఖాతాదారుల ఆదాయ-వ్యయ నిష్పత్తిలో ఏమాత్రం పొంతన లేకుండా ఉండటం, స్థిరమైన ఆదాయం మరియు అద్భుతమైన క్రెడిట్ స్కోరును కలిగి ఉన్న వారు సైతం చాలా మంది ఖాతాదారులు ఉంటారు. పై విషయాల ఆధారంగా, క్రెడిట్ కార్డులను రెండు రకాలుగా విభజించవచ్చు:  ఒకటి సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్.  రెండోది అన్‌సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్

క్రెడిట్ కార్డు పేరు విని కంగారు పడాల్సిన పనిలేదు. సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ (Secured Credit Card) అనేది అస్థిరమైన ఆదాయాన్ని కలిగి ఉన్నవారికి లేదా క్రెడిట్ స్కోరు అంతగా బాగాలేని వ్యక్తులకు ఇస్తారు. ఇలాంటి తరహా ఖాతాదారులతో ప్రాథమికంగా సెక్యూరిటీ డిపాజిట్ కట్టించుకుని సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ జారీ చేస్తారు. సెక్యూర్డ్ లోన్ తరహాలోనే సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ తర్వాతే సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్స్ జారీ అవుతాయి.

Also Read: PM Kisan Scheme: రైతుల ఖాతాల్లోకి రూ.2000 జమ.. వివరాలు ఇలా చెక్ చేసుకోండి

సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్‌పై లిమిట్ అనేది ఆ ఖాతాదారులు చేసిన ఫిక్స్‌డ్ డిపాజిట్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి నెలా ఆ కస్టమర్ గరిష్టంగా 80శాతం వరకు నగదు లిమిట్‌ను మాత్రమే వినియోగించుకోవచ్చు. అన్‌సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు ఎలాగూ స్థిరమైన ఆదాయం, ఖర్చు వివరాలు ఉంటాయి కనుక వీరికి ఇచ్చే క్రెడిట్ కార్డ్‌లపై అంతగా సమస్యేమీ ఉండదు.

పలు బ్యాంకు సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్నాయి. ఎఫ్‌డీలపై జారీ అవుతున్న సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులు ఇవే.. 

ఎస్‌బీఐ ఉన్నతి ఎస్‌బీఐ అడ్వాంటేజ్ ప్లస్ క్రెడిట్ కార్డ్ ఐసీఐసీఐ బ్యాంక్ తక్షణ ప్లాటినం క్రెడిట్ కార్డ్ ఐసీఐసీఐ బ్యాంక్ కోరల్ క్రెడిట్ కార్డ్ ఐసీఐసీఐ బ్యాంక్ రూబిక్స్ క్రెడిట్ కార్డ్ యాక్సిస్ బ్యాంక్ ఇన్‌స్టా ఈజీ క్రెడిట్ కార్డ్ కొటక్ మహీంద్రా బ్యాంక్ ఆక్వా గోల్డ్ క్రెడిట్ కార్డ్

Also Read: Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana: రూ.330 చెల్లిస్తే.. రూ.2 లక్షల కవరేజీ, స్కీమ్ పూర్తి వివరాలివే

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link