Dream Meaning: కలలో మీ కుటుంబసభ్యుల మరణం చూశారా? అది ఏ సంకేతమో తెలుసా?

Fri, 26 Apr 2024-8:08 am,

సాధారణంగా కలలో మన కుటుంబీకులు ఎవరైనా చనిపోతే వెంటనే నిద్ర లేస్తాం. కంగారు పడిపోతాం. అయితే, మన పూర్వీకుల కాలంనాటి నుంచి చెప్పేది ఏందంటే కుటుంబీకులు కలలో చనిపోయినట్లు వస్తే వారి ఆయుష్షు పెరుగుతుందట. అంతేకాదు ఇప్పటి వరకు వాళ్లు ఎదొర్కొంటున్న కష్టాలు ఏమైనా ఉంటే వెంటనే తొలగిపోతాయట.  

మన జీవితంలో మరణం అంటేనే ప్రతి ఒక్కరికీ భయం. అయితే, జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం అలాంటి కలలు మంచివే. వీటితో పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. అది శుభం, మంచి కల అని అర్థం. వారి ఆయుష్షు పెరుగుతుందని అర్థం కూడా.  

కలలో కుటుంబ సభ్యుల మరణం చూస్తే భయపడాల్సిన పనిలేదు. వారి జీవితంలో కొత్త అధ్యయనం మొదలవుతుందని కూడా అర్థం. కాబట్టి భయపడకుండా ఆనందంగా ఉండాల్సిన విషయం. మొత్తానికి కలలో మీ బంధువు లేదా కుటుంబ సభ్యుల మరణం చూస్తే శుభమే అవుతుందని జోతిష్య నిపుణులు చెబుతున్నారు.  

ఉదయం వచ్చిన కలలు నిజమవుతాయనే నమ్మకం కూడా ఉంది. వీటికి కొన్ని పరిహారాలు కూడా ఉంటాయి. ఉదయం సమయంలో భయానక కలలు వస్తే పండితులను కలిసి వారి సలహాలు తీసుకోవాలి. వారి సూచనలను అనుసరించాలి. సాధారణంగా ఏవైనా భయానక కలలు చూస్తే కూడా వెంటనే ఉదయం స్నానం చేసి గజేంద్ర మోక్షం పఠించాలి. లేదా వినాలి అంటారు.   

కొన్ని కలలు మన ఆలోచనలు, రోజంత మనకు జరిగిన ఘటనలే రాత్రి సమయంలో మళ్లీ దానికి సంబంధించిన కలలు వస్తాయి. కొన్ని కలలు శుభ సూచకలు, మరికొన్ని అశుభ సూచకలు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link