Money deposits in accounts: 18 ఏళ్లు నిండిన వారి బ్యాంక్ ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.1,30,000 ?
ఈ మెసేజ్‌లో వాస్తవం లేదని తెలియని కొంతమంది జనం తొందరపాటుతో తాము అర్హులమో కాదో తెలుసుకుందాం అనుకుని ఆ లింకుపై క్లిక్ చేస్తున్నారు. సరిగ్గా ఇక్కడే అసలు మోసం జరుగుతోంది. ఆ లింక్ నిజంగా వాళ్లు చెప్పినట్టుగా అర్హత తెలుసుకోవడానికి ఇచ్చిన లింక్ కాదు.. అది ఫిషింగ్ ఎటాక్ లింక్.
ఫిషింగ్ ఎటాక్ అంటే ఏంటి ? జనం బ్యాంకు ఖాతాల్లో కానీ లేదా వారి క్రెడిట్ కార్డుల్లో కానీ ఉన్న మొత్తాన్ని కొట్టేయడానికి, లేదా వారి వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించడానికి సైబర్ క్రిమినల్స్ విసిరే వలే ఈ ఫిషింగ్ మెసేజ్.
ఫిషింగ్ మెసేజుల్లో ఉండే లింకులను క్లిక్ చేస్తే చాలు.. మీ ఫోన్‌లో ఉన్న సమాచారం అంతా వారికి బదిలీ అయిపోతుంది. లేదా మీ చేత మీరే మీ బ్యాంక్ ఖాతా, మీ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ( Debt card, Credit vard ) , ఆధార్ కార్డు నెంబర్, ఏటీఎం పిన్ లేదా మీ మొబైల్‌కి వచ్చిన ఓటిపి ( ATM PIN ) వంటి వాటిని మీరే అక్కడ ఎంటర్ చేసేలా చేసి ఆ తర్వాత దోపిడీకి పాల్పడటం సైబర్ క్రిమినల్స్ లక్ష్యం.
ఆ మెసేజ్‌లో ఉన్న లింకుపై పబ్లిక్ క్లిక్ చేసేలా వారు ఏదో ఒకటి ఆశ చూపిస్తారు. మీరు లాటరీ గెలిచారనో లేక మీకు లక్కీ లాటరి తగిలిందనో లేక మీకు బంపర్ ఆఫర్ వచ్చిందనో ఇవేవీ కాకుండా ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏదో ఓ పథకం కింద ఇలా నగదు గెలుచుకున్నారనో ఆ మెసేజ్‌లో పేర్కొంటారు.
ఆ మెసేజ్ వెనుక సైబర్ క్రిమినల్స్ ఉన్నారని, వారి అసలు ఉద్దేశం వేరే అని తెలియని వాళ్లు ఆ లింకుపై క్లిక్ చేసి మోసపోతుంటారు. ఇదే ఫిషింగ్ ఎటాక్.
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఫేక్ న్యూస్ కథనాల గురించి స్పందించి వాటిపై వివరణ ఇస్తున్న ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో ( PIB )
కొవిడ్ -19 ఫండ్ కింద బ్యాంకు ఖాతాల్లో లక్ష 30 వేల రూపాయల క్యాష్ డిపాజిట్ అని వైరల్ అవుతోన్న వాట్సాప్ మెసేజ్‌లో నిజం లేదని.. కేంద్రం అలా ఎవ్వరికీ డబ్బు ఇవ్వడం లేదని పిఐబి తమ ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించింది.
ఇది ఫేక్ మెసేజ్ అని తెలియని కొంత మంది అమాయకులు దానిని తమ మిత్రులకు షేర్ చేస్తుండటంతో ఈ వాట్సాప్ మెసేజ్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఈ తరహా మెస్సెజులు, మెయిల్స్‌కి స్వీయ విచక్షణతోనే చెక్ పెట్టాలని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఉచితాలకు ఆశపడే క్రమంలోనే సైబర్ నేరస్తుల చేతిలో మోసపోతారని.. ఏదైనా ఉచితంగా వస్తుందంటే.. అందులో ఉన్న సాధ్యాసాధ్యాలను గుర్తించకుండా తొందరపడటం సరికాదంటున్నారు సైబర్ ఎక్స్‌పర్ట్స్.
Also read : Student registration in TASK: టాస్క్‌లో మీ పేరు రిజిస్టర్ చేసుకున్నారా ?
Also read : SBI Jobs: ఎస్బీఐలో 2000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలు, ముఖ్యమైన తేదీలు
Also read : How to get MUDRA loan: ముద్ర లోన్‌కి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?